రాత్రి భోజనం మానేస్తున్నారా..? అయితే, ఇది తెలుసుకోండి..!

by Kanadam.Hamsa lekha |   ( Updated:2024-11-06 07:43:35.0  )
రాత్రి భోజనం మానేస్తున్నారా..? అయితే, ఇది తెలుసుకోండి..!
X

దిశ, ఫీచర్స్: ఉదయం బ్రేక్‌ఫాస్ట్, నైట్ డిన్నర్ రోజు వారి ఆహారం చాలా ముఖ్యమైనవి. కానీ, కొందరు బరువు తగ్గడం కోసం కష్టపడుతుంటారు. ఉదయం బ్రేక్‌ఫాస్ట్, నైట్ డిన్నర్ రోజు వారి ఆహారం చాలా ముఖ్యమైనవి. కానీ, కొందరు బరువు తగ్గడం కోసం కష్టపడుతుంటారు.రు. జిమ్‌కి వెళ్లి వ్యాయామాలు చేస్తుంటారు. అంతేకాకుండా రాత్రిపూట భోజనం మానేసి, కేవలం ఫ్రూట్స్ మాత్రమే తింటారు. మరి కొందరు అసలేం తినకుండా ఉంటారు. ఇలా చేస్తే, త్వరగా బరువు తగ్గుతామని అనుకుంటారు. కానీ, నిజానికి ఇలా చేయడం ప్రమాదమేనని నిపుణులు సూచించారు. రాత్రి భోజనం మానేయడం వల్ల శరీరంలో శక్తిస్థాయి తగ్గిపోతుంది. జీర్ణ సమస్యలు, శరీరంలో పోషకాహార లోపం వంటి సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది.

తినకపోవడం వల్ల వచ్చే సమస్యలు:

జీర్ణ సమస్య: రాత్రిపూట తినకపోవడం వల్ల అజీర్ణం, గ్యాస్ట్రిక్, మలబద్ధకం వంటి సమస్యలు సంభవించవచ్చు.

పోషకాల లోపం: శరీరానికి అవసరమైన పోషకాలు అందకపోవడం. దీని కారణంగా నీరసం, అలసట, బలహీనత వంటి లక్షణాలు వస్తాయని అధ్యయనాలు తెలిపాయి.

రక్తంలో చక్కెర స్థాయి తగ్గడం: రాత్రిళ్లు తినకపోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలో హెచ్చుతగ్గులు ఏర్పడుతుంటాయి. ఈ కారణంగా మధుమేహం, దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవకాశం ఉంది.

అధిక బరువు పెరగడం: నైట్‌టైమ్ తినకపోవడం వల్ల పగటిపూట ఎక్కువగా తినే అవకాశం ఉంటుంది. ఇది మీ బరువు పెరగడానికి దారితీస్తుంది. ఎందుకంటే రాత్రి తినకపోవడం వల్ల మార్నింగ్ ఎక్కువగా ఆకలి వేస్తుంది. దీంతో బ్రేక్‌ఫాస్ట్ ఎక్కువ తింటారు. దీని కారణంగా బరువు పెరిగే అవకాశం ఉంటుంది.

నిద్ర: డిన్నర్ చేయడకపోవడం వల్ల సరిగా నిద్రపోలేరని నిపుణులు తెలుపుతున్నారు. మంచిగా నిద్రపోవాలంటే శరీరానికి శక్తి చాలా అవసరం. ఇలా రాత్రి తినకుండా ఉంటే బద్ధకం, నీరసం, చిరాకు వంటి సమస్యలు వస్తాయి.

*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది.‘దిశ’ ధృవీకరించలేదు. అనుమానాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించగలరు.

Advertisement

Next Story