AP High Court: నందిగం సురేష్‌కు హైకోర్టులో చుక్కెదురు.. బెయిల్ పిటిషన్ కొట్టివేత

by Shiva |
AP High Court: నందిగం సురేష్‌కు హైకోర్టులో చుక్కెదురు.. బెయిల్ పిటిషన్ కొట్టివేత
X

దిశ, వెబ్‌డెస్క్: బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ (Nandigam Suresh)కు ఏపీ హైకోర్టులో చుక్కెదురైంది. తుళ్లూరు (Thulluru) మండలం వెలగపూడి (Velagapudi) గ్రామానికి చెందిన మరియమ్మ (Mariyamma) హత్య కేసులో తనకు రెగ్యులర్‌ బెయిలు మంజూరు చేయాలని దాఖలు చేసిన పిటిషన్‌ను ధర్మాసనం కొట్టివేసింది. ఈ కేసులో ఇప్పటికే నందిగం సురేష్ గుంటూరు జిల్లా జైలులో (Guntur District Jail) రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆయనను కస్టడీకి తీసుకుని తుళ్లూరు (Thulluru) పోలీసులు విచారణ జరిపిన విషయం తెలిసిందే.

సురేష్‌కు రెగ్యులర్ బెయిల్ ఇస్తే.. సాక్షులను బెదిరించి మొత్తం సాక్షాలను తారుమారు చేసే అవకాశం ఉందని పోలీసుల తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. హత్యకు సంబంధించి తమ వద్ద పక్కా ఆధారాలు ఉన్నా.. తనకు ఎలాంటి సంబంధం లేదని నిందితుడు పోలీసుల విచారణలో పచ్చి అబద్ధాలు చేప్పాడని వాదించారు. అతడికి ఎట్టి పరిస్థితుల్లో రెగ్యులర్ బెయిల్ ఇవ్వకూడదని కోర్టుకు విన్నవించారు. ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం నందిగం సురేష్ (Nandigam Suresh) బెయిల్ పిటిషన్‌ (Bail Petition)ను కొట్టివేస్తూ తీర్పును వెలువరించింది.

Advertisement

Next Story