పేకాట స్థావరాలపై టాస్క్ ఫోర్స్ ఉక్కు పాదం..

by Aamani |
పేకాట స్థావరాలపై టాస్క్ ఫోర్స్ ఉక్కు పాదం..
X

దిశ,బెల్లంపల్లి :పేకాట స్థావరాలపై టాస్క్ ఫోర్స్ పోలీసులు కొరడా ఝులిపిస్తున్నారు. మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలో ఆకస్మికంగా పేకాట స్థావరంపై దాడి చేసి ఆరుగురుని పట్టుకున్నారు. రూ. 13, 220 నగదును స్వాధీనం చేసుకున్నారు. ఐదు సెల్ ఫోన్లు కూడా దొరికాయి. సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.

టాస్క్ ఫోర్స్ సీఐ రాజ్ కుమార్ , టాస్క్ ఫోర్స్ ఎస్సై టాస్క్ ఫోర్స్ సిబ్బందితో కలిసి కాసిపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని చిన్న ధర్మారం శివారు అడవి ప్రాంతంలో రహస్యంగా నిర్వహిస్తున్న పేకాట స్థావరం పై ఆకస్మిక దాడి చేశారు. ఈ సంఘటనలో పేకాట ఆడుతున్న ఆరుగురు పేకాట రాయుళ్లు ముత్తంపల్లికి చెందిన ఎగ్గే రాజు కుమార్, వేల్పుల సతీష్, చిన్న ధర్మారానికి చెందిన షేక్ అహ్మద్, ఎండి యాకిన్, ముత్యంపల్లికి చెందిన మారం శంకర్, చిన్న ధర్మానికి చెందిన సూరం శ్రీనివాస్ రెడ్ హ్యాండెడ్ గా అరెస్టు అయ్యారు. పట్టుబడిన నిందితులను టాస్క్ ఫోర్స్ పోలీసులు కాసిపేట పోలీస్ స్టేషన్ లో అప్పగించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed