- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Google India: గూగుల్ ఇండియా కంట్రీ మేనేజర్, వైస్ ప్రెసిడెంట్‌గా ప్రీతి లోబానా నియామకం
దిశ, బిజినెస్ బ్యూరో: టెక్ దిగ్గజం గూగుల్ భారత కొత్త వైస్ ప్రెసిడెంట్, కంట్రీ మేనేజర్‌గా ప్రీతి లోబానాను నియమిస్తున్నట్టు సోమవారం ప్రకటించింది. ఇటీవలి వరకు ఈ బాధ్యతలు నిర్వహించిన సంజయ్ గుప్తా గూగుల్ ఆసియా పసిఫిక్ రీజియన్ ప్రెసిడెంట్‌గా బదిలీ అయిన నేపథ్యంలో ప్రీతి లోబానా నియామకాన్ని కంపెనీ ఖరారు చేసింది. ప్రీతి లోబానా నియామకంతో కస్టమర్లకు ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్(ఏఐ) టెక్నాలజీ మరింత చేరువ చేసేందుకు, కొత్త ఆవిష్కరణలను రూపొందించడంలో కీలక పాత్ర పోషిస్తారని గూగుల్ తన అధికారిక ప్రకటనలో తెలిపింది. ప్రీతి లోబానాకు కస్టమర్-సెంట్రిక్ సొల్యూషన్స్ వైస్ ప్రెసిడెంట్‌గా ఎనిమిదేళ్ల అనుభవం ఉంది. గూగుల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్‌గా అమ్మకాలు, కార్యకలాపాల బాధ్యతలను నిర్వహించనున్నారు. ఏఐ టెక్నాలజీ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో దీన్ని మరింత వేగవంతం చేసేందుకు ఆమె పనితీరు ఎంతో ఉపయోగపడుతుందని సంజయ్ గుప్తా అన్నారు.