- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రైల్వే డబ్లింగ్ భూ నిర్వాసితులకు న్యాయం చేయాలి..
దిశ,కారేపల్లి : డోర్నకల్ - భద్రాచలం రోడ్ వరకు డబ్లింగ్ రైల్వే స్పెషల్ ప్రాజెక్టు కోరకు భూ సేకరణ చట్టబద్దంగా జరగడం లేదని భూ నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం ఖమ్మంలో కలెక్టరేట్‌లో భూ సేకరణ ఉప కలెక్టర్ రాజేశ్వరిని కలిసిన బాధితులు తమ గోడు వినిపించారు. భూ సేకరణకు రైల్వే, రెవిన్యూ శాఖలు నిర్వాసితులకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా సేకరణకు ఏకపక్షంగా పేపర్ ప్రకటన ఇచ్చి నిర్వాసితులను ఆందోళనకు గురి చేసిందన్నారు. సింగరేణి మండలంలో సింగరేణి రెవిన్యూ గ్రామంలో బహిరంగ మార్కెట్‌లో ఎకర భూమి రూ.కోటి పలుకుతుందని, ఇంటి స్ధలం గజం రూ.15 వేలు పలుకుతుందని అధికారులకు వివరించారు. అధిక విలువ, రెండు పంటలు పండే భూములు కోల్పవటం వలన తమ జీవనాధారం కోల్పోతామని ఆవేదన వెలిబుచ్చారు. భూములు కోల్పోతున్న తమకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. వినతి పత్రం అందించిన వారిలో రైతులు కోటి అప్పారావు, ముక్కా వెంకటేశ్వర్లు, ముండ్ల ఏకాంబరం, తొగరు శ్రీను, ఇస్లావత్ వీరమ్మ, సోమందుల వెంకటేశ్వర్లు, హుస్సెన్, కొమ్మూరి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.