- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
High Court: కౌశిక్ రెడ్డి ఫోన్ తిరిగి ఇచ్చేయాలని పోలీసులకు హైకోర్టు ఆదేశం

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్(BRS) ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి(Kaushik Reddy) ఫోన్‌ను తిరిగి ఇచ్చేయాలని పోలీసులకు తెలంగాణ హైకోర్టు(Telangana High Court) ఆదేశాలు జారీ చేసింది. నిబంధనల ప్రకారం నోటీసులు ఇవ్వకుండా ఫోన్‌ను స్వాధీనం చేసుకోవడానికి వీళ్లేదని హైకోర్టు పేర్కొంది. దీనికి ప్రభుత్వ తరపు న్యాయవాది స్పందిస్తూ.. బంజారాహిల్స్ సీఐ(Banjara Hills Police) విధులకు ఆటంకం కలిగించిన ఘటనలో కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు చేశామని.. దర్యాప్తులో భాగంగా ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కౌశిక్ రెడ్డి మొబైల్(Kaushik Reddy Phone)ను ఎఫ్‌ఎస్ఎల్‌కు పంపించాల్సి ఉందని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన కుట్రలు పన్నుతున్నారని ప్రభుత్వ తరపు న్యాయవాది అన్నారు. ఫోన్‌ను సీజ్ చేయాల్సి ఉంటే నిబంధనల ప్రకారం ముందు నోటీసులు ఇచ్చి ఆ తర్వాత స్వాధీనం చేసుకోవాలని కోర్టు సూచించింది. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా మొబైల్‌ను లాగేసుకున్నారని కౌశిక్ రెడ్డి న్యాయవాది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.