Manoj: ‘నా ప్రైవసీకి భంగం కలిగించే ఛాన్స్ ఎవరికీ ఇవ్వను’.. బాలీవుడ్ హీరో సెన్సేషనల్ కామెంట్స్

by Anjali |
Manoj: ‘నా ప్రైవసీకి భంగం కలిగించే ఛాన్స్ ఎవరికీ ఇవ్వను’.. బాలీవుడ్ హీరో సెన్సేషనల్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ హీరో మనోజ్ బాజ్‌పేయీ(Bollywood hero Manoj Bajpayee) తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరై పలు విషయాలు చెప్పుకొచ్చారు. బాలీవుడ్‌లో ఎక్కువగా పార్టీలు జరుపుకుంటారని, బీటౌన్‌లో పార్టీ కల్చర్ ఎక్కువ అని చెప్పుకొచ్చారు. కానీ నాకు పార్టీలకు హాజరవ్వడం ఇష్టముండదని తెలిపారు. వేరేవాళ్లు పిలిస్తే నేను హారవ్వకపోవడం వల్ల.. వారు బాధపడ్డ సందర్బాలు కూడా ఉన్నాయని అన్నారు. ఇక కొన్నిడేస్ నుంచి నన్ను పార్టీస్‌కు పిలవడమే మానేశారని పేర్కొన్నారు. అలాగే రాత్రి పది గంటల వరకే నిద్రపోతానని.. మార్నింగ్ తెల్లవారుజామున లేస్తానని తెలిపారరు.

అప్పుడప్పుడు ఫ్రెండ్స్‌ను కలుస్తానని.. నవాజుద్ధీన్ సిద్ధిఖీ(Nawazuddin Siddiqui) అండ్ కేకే మేనన్(KK Menon) ‌తో మంచి పరిచయం ఉందని అన్నారు. కానీ బిజీగా ఉండడం వల్ల మేం ఎప్పుడో ఒకసారి మీట్ అవుతామని వెల్లడించారు. అలాగే నేను కొత్తవారితో తొందరగా కలిసిపోలేనని, దీంతో చాలా మంది దాన్ని పొగరు, అహంకారమని అనుకుంటారని వివరించారు. కానీ నేను అవన్నీ పట్టించుకోనని, కానీ ఎప్పుడో ఒకసారి మాత్రం వారికే నా ప్రవర్తన గురించి తెలుస్తుందని అన్నారు. ఇక నాపై వారికున్న ఊహలన్నీ అవాస్తవాలనీ రియలైజ్ అవుతారని.. వాస్తవానికి నాకు పొగరు లేదు ఆత్మాభిమానం ఉందని వెల్లడించారు. నా ప్రైవసీకి ఇబ్బంది కలిగించే ఛాన్స్ ఎవరికీ ఇవ్వనని పేర్కొన్నారు మనోజ్.

Advertisement

Next Story