- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఉదయం పెళ్లి.. మధ్యాహ్నం హత్య.. మియాపూర్ మైనర్ హత్య కేసులో షాకింగ్ నిజాలు
దిశ, వెబ్ డెస్క్: మియాపూర్ (Miyapur)లో సంచలనం సృష్టించిన మైనర్ బాలిక హత్యకేసులో షాకింగ్ విషయాలు వెలుగు చూస్తున్నాయి. బాలికను హత్య చేసిన తీరుపై పోలీసుల విచారణలో నిజాలు బట్టబయలయ్యాయి. చింటూ అనే వ్యక్తి ఇన్ స్టాగ్రామ్ (Instagram)లో ఓ బాలికను ప్రేమ పేరుతో మోసం చేసి.. పెళ్లి నాటకంతో హత్య చేశాడు. పోలీసుల విచారణలో అతను గతంలో చిన్న చిన్న దొంగతనాల కేసుల్లో జైలుకెళ్లినట్లు తేలింది. బాలిక కుటుంబ సభ్యుల్ని తప్పుదారి పట్టించేందుకు చింటూ రకరకాల ప్రయత్నాలు చేసినట్లు విచారణలో వెల్లడైంది.
నవంబర్ 8న ఉదయం బాలికను పెళ్లి చేసుకుంటానని నమ్మించిన చింటూ పుస్తెలతాడు, పూలదండలు కొని.. తన స్నేహితుడి ఇంట్లోనే తాళి కట్టి దండలు మార్చుకున్నారు. ఫొటోలు దిగి వాటిని స్నేహితులు, బాలిక కుటుంబ సభ్యులకు, స్నేహితురాలికి పంపాడు. అందరినీ తమకు పెళ్లైందని నమ్మించే ప్రయత్నం చేసి.. హత్యకు ప్లాన్ చేశాడు. తన స్నేహితుడు, అతని వైఫ్ బయటికి వెళ్లాక బాలికను హతమార్చాడు. వారిద్దరూ ఇంటికి వచ్చాక.. బాలిక డెడ్ బాడీని మాయం చేయాలనుకున్నాడు.
బాలికను చంపిన తర్వాత.. ఆ రోజు మధ్యాహ్నం నుంచి ఆమె కుటుంబ సభ్యులకు టచ్ లో ఉన్న చింటూ.. బాలిక కనిపించడం లేదని నాటకం మొదలుపెట్టాడు. ఆమె ఆచూకీ కోసం వెతుకుతున్నామని ఫ్రెండ్స్ కు సమాచారమిచ్చాడు. బాలిక మిస్సింగ్ పై పోలీసులు విచారణ వేగవంతం చేయడంతో.. చింటూ తప్పించుకునేందుకు యత్నించాడు. పోలీసులకు అతనిపై అనుమానం రావడంతో.. టెక్నికల్ గా లాక్ చేశారు. పలుమార్లు వాట్సప్ కాల్స్ చేసినట్లు నిర్థారణ కావడంతో అరెస్ట్ చేశారు.