Maharashtra - Jharkhand Elections: మహారాష్ట్ర, జార్ఖండ్ లలో 11 గంటల వరకు పోలింగ్ వివరాలివే..

by Shamantha N |
Maharashtra - Jharkhand Elections: మహారాష్ట్ర, జార్ఖండ్ లలో 11 గంటల వరకు పోలింగ్ వివరాలివే..
X

దిశ, నేషనల్ బ్యూరో: మహారాష్ట్ర, జార్ఖండ్‌లలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ (Polling in Assembly Elections) కొనసాగుతోంది. కాగా.. పోలింగ్ ప్రారంభమైన తొలిగంటలో పోలింగ్ త్వరత్వరగా పూర్తికాగా.. ప్రస్తుతం ఓటింగ్ నెమ్మదిగా సాగుతోంది. ఉదయం 7 గంటలకు ఓటింగ్‌ మొదలవగా.. ఉదయం 11 గంటల వరకు మహారాష్ట్ర (Maharashtra)లో 18.14శాతం పోలింగ్‌ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఇక, జార్ఖండ్ లో (Jharkhand) 31.37శాతం ఓటింగ్‌ జరిగింది. కాగా.. మహారాష్ట్రలోని మొత్తం 288 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ జరగుతోంది. జార్ఖండ్ లోని మొత్తం 81 స్థానాలకుగానూ రెండో విడతలో 38 స్థానాల్లో ఓటింగ్ కొనసాగుతోంది. అంతేకాకుండా, పలు రాష్ట్రాల్లోని కొన్ని అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. నవంబరు 23న ఓట్ల ఫలితాలు రానున్నాయి.

Advertisement

Next Story

Most Viewed