Brain Stroke: బ్రెయిన్ స్ట్రోక్‌‌ దరిచేరకుండా ఉండాలంటే..?

by Anjali |   ( Updated:2024-11-20 07:27:56.0  )
Brain Stroke: బ్రెయిన్ స్ట్రోక్‌‌ దరిచేరకుండా ఉండాలంటే..?
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత రోజుల్లో చాలా మంది బ్రెయిన్ స్ట్రోక్(Brain Stroke) బారిన పడుతున్నారు. కాగా ఈ వ్యాధి దరిచేరముందే పలు జాగ్రత్తలు తీసుకుంటే మేలని నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం..

బీపీ అదుపులో ఉండాలి..

బ్రెయిన్ స్ట్రోక్ రావడనికి బ్లడ్ ప్రెజర్ పెరగడం(Increased blood pressure) కూడా ఓ కారణమే. ఆడవారి కంటే ఈ వ్యాధి మగవారిలోనే ఎక్కువగా కనిపిస్తుంది. కాగా బీపీ(BP)నీ ఎప్పటికప్పుడు కంట్రోల్‌లో ఉంచుకోవాలి. హై కొలెస్ట్రాల్ ఫుడ్స్(High cholesterol foods), చీజ్(Cheese), బర్గర్స్(Burgers) , ఐస్ క్రీమ్స్(Ice creams) వంటివి ఎక్కువగా తినకూడదు. అలాగే సాల్ట్ అధికంగా తీసుకోకూడదు. తాజా పండ్లు(Fresh fruits), వారానికి రెండు సార్లు చేపలు(Fish) తినాలి. అలాగే ప్రతిరోజూ 30 నిమిషాలు వర్కౌట్స్(workouts) చేయాలి.

ఆల్కహాల్ అండ్ స్మోకింగ్‌కు దూరంగా ఉండాలి..

స్మోకింగ్(Smoking) అండ్ ఆల్కహాల్(Alcohol) సేవించడం వల్ల ఎంతమంది అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. కాగా స్మోకింగ్ కు పూర్తిగా దూరంగా ఉండటం బెటర్. అలాగే ఆల్కహాల్‌ను క్రమంగా తగ్గిస్తూ మానుకోవడం ఆరోగ్యానికి మేలు. దీంతో బ్రెయిన్ స్ట్రోక్ బారిన పడకుండా ఉంటారు.

ఒత్తిడి నుంచి ఉపశమనం..

ప్రస్తుత రోజుల్లో బిజీ షెడ్యూల్డ్ కారణంగా స్ట్రెస్, ఒత్తిడి(stress) లోనై బ్రెయిన్ స్ట్రోక్ వ్యాధి బారిన పడుతున్నారు. ఒత్తిడి మెదడుకే కాదు గుండె(heart)కు కూడా మంచిది కాదు. కాగా ప్రతిరోజూ ధ్యానం(meditation), ప్రాణాయామం(Pranayama) వంటి చేయాలి. సంగీతం(Music) వినాలి. పెయింటింగ్(Painting), గార్డెనింగ్(Gardening), డ్యాన్స్(Dance) వంటి మీకు నచ్చిన పనులు చేయండి. దీంతో మైండ్ రిలీఫ్‌గా ఉంటుంది. బ్రెయిన్ స్ట్రోక్ రాకుండా ఉంటుంది.

బరువును తగ్గించుకోవాలి..

వయసును బట్టి మీరు ఉండాల్సిన బరువును మెంటైన్(Maintain weight) చేయాలి. అధిక బరువు కారణంగా కూడా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంది. కాగా రెగ్యులర్‌గా వర్కౌట్స్ చేయాలి. వాకింగ్ చేయాలి. దీంతో రోజంగా యాక్టివ్‌గా కూడా ఉంటారు.

హెల్దీ డైట్...

ఈ ఉరుకుల పరుగుల జీవితంలో చాలా మంది సరైన సమయానికి సరైన ఫుడ్ తీసుకోవట్లేదు. బ్రెయిన్ స్ట్రోక్ రావడానికి ఇదో కారణమని చెప్పుకోవచ్చు. కాగా కూరగాయలు, తాజా పండ్లు తీసుకోవాలి. వీటిలోని పుష్కలమైన విటమిన్లు(Vitamins), యాంటీ ఆక్సిడెంట్లు(Antioxidants) మెదడును రక్షిస్తాయి. వీటితో పాటుగా చేపలు, వాల్ నట్స్(Wall nuts), ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్(Omega 3 Fatty Acids) వంటివి తీసుకుంటే వెయిట్ పెరగకుండా ఉంటారు. డయాబెటిస్(Diabetes), బ్రెయిన్ స్ట్రోక్() బారిన పడకుండా ఉంటారు.

Advertisement

Next Story

Most Viewed