పెళ్లి కాని వారిలో డిప్రెక్షన్ లక్షణాలు.. అధ్యయనాలు ఏం చెబుతున్నాయంటే..!

by Kanadam.Hamsa lekha |   ( Updated:2024-11-20 07:30:59.0  )
పెళ్లి కాని వారిలో డిప్రెక్షన్ లక్షణాలు.. అధ్యయనాలు ఏం చెబుతున్నాయంటే..!
X

దిశ, ఫీచర్స్: సమాజంలో వివాహానికి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. కానీ, ఈ రోజుల్లో కొందరు ఒంటరిగా ఉండేందుకు పెళ్లికి నో చెబుతున్నారు. అయితే, పెళ్లి చేసుకోకపోవడం వల్ల చాలామంది యువత డిప్రెషన్‌‌కు గురవుతున్నారు. అదెలా అంటారా. ప్రపంచవ్యాప్తంగా వివాహా వ్యవస్థపై ఎన్నో రకాల పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే.. మకావు పాలిటెక్నిక్ యూనివర్సిటీ వారు 18 ఏళ్లు పైబడిన లక్ష మంది అవివాహితులపై ఒక అధ్యయనం చేశారు. ఈ అధ్యయనంలో వారికి కొన్ని షాకింగ్ విషయాలు తెలిశాయి. పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా జీవించే వారిలో డిప్రెషన్ వచ్చే అకవాశం ఉందని ఈ పరిశోధనలో తేలింది. ఇందులో చైనా, కొరియా, మెక్సికో, ఐర్లాండ్, యునైటెడ్ స్టేట్స్, ఇండోనేషియా వంటి ఇతర దేశాలకు చెందిన వారు కూడా పాల్గొన్నారు.

పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా జీవించే వారిలో 80 శాతం మందికి ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉన్నట్లు తేలింది. ఇక, పెళ్లి అయిన వారిలో ఈ డిప్రెషన్ బారిన పడేవాళ్లు 40 శాతం మంది ఉన్నట్లు అధ్యయనంలో తెలిపింది. జీవిత భాగస్వామితో విడిపోయిన వారిలో కూడా అనేక సమస్యలు కనిపించాయని వెల్లడించింది. అసలు ఈ డిప్రెషన్ లక్షణాలు ఎలా కనిపిస్తాయో తెలుసుకుందాం.

ఎక్కువగా నిద్రపోతూ ఉండడం లేదా పూర్తిగా నిద్రను తగ్గించడం వంటివి చేస్తుంటారు. ఉదయం నుంచి రాత్రి వరకు కూడా ఒంటరిగా ఉంటూ, నీరసంగా ప్రవర్తిస్తుంటారు. దీన్ని తీవ్రమైన డిజార్డర్‌గా కూడా చెప్పవచ్చు. అయితే, ఈ డిప్రెషన్ సమస్యను తేలికగా తీసుకుంటే ఆరోగ్య సమస్యలకు కారణం అవుతుంది. అంతేకాకుండా శరీరం, ఆహరంపై శ్రద్ధ చూపరు. ఎటువంటి కార్యక్రమాల్లోనైనా పాల్గొనడానికి ఇష్టపడరు. ఎప్పుడూ ఒంటరిగానే ఉంటారు. ఇక, భారతదేశంలో అయితే, 14 శాతం మంది ప్రజలు డిప్రెషన్‌తో బాధపడుతున్నట్లు గణాంకాలు వెల్లడించాయి.

Advertisement

Next Story