UP Wedding Procession: పెళ్లి ఊరేగింపులో రూ. 500 నోట్లు వెదజెల్లి హల్ చల్

by Shamantha N |
UP Wedding Procession: పెళ్లి ఊరేగింపులో రూ. 500 నోట్లు వెదజెల్లి హల్ చల్
X

దిశ, నేషనల్ బ్యూరో: ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) లోని పెళ్లి ఊరేగింపులో హల్ చల్ జరిగింది. గ్రాండ్ గా బారాత్(UP Wedding Procession) జరిపి వివాదంలో చిక్కుకున్నారు. గాల్లోకి ఏకంగా లక్షలు వెదజల్లారు. ఈఘటన ఉత్తర ప్రదేశ్‌లోని సిద్ధార్థనగర్‌లో వెలుగుచూసింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. అఫ్జల్, అర్మాన్ వివాహాం జరిగిన తర్వాత ఊరేగింపు నిర్వహించారు. అంత సవ్యంగా సాగుతుండగా.. వరుడు, వధువు పక్కన ఉన్న బంధువులు ఒక్కసారికి గాలిలోకి డబ్బులు విసిరారు. దాదాపు రూ.20 లక్షలు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. చుట్టుపక్కలా ఉన్న ఇళ్లపై, జేసీబీలపై నిలబడి నోట్ల కట్టలను గాల్లోకి జల్లారు. రూ. 100, 200, 500 నోట్ల కట్టలను గాలిలోకి విసిరారు. దీంతో గాల్లో ఎగురుతున్న నోట్లను స్థానికులు పట్టుకునేందుకు ఎగబడ్డారు. ఈ వీడియో వైరల్‌ అవ్వడంతో.. నెటిజన్ల నుంచి భిన్న స్పందనలు వస్తున్నాయి. కొంతమంది నెటిజన్లు డబ్బును అవసరమైన వారికి పంచాలని సూచించారు., మరికొందరు ఆదాయపు పన్ను కార్యాలయానికి(Income Tax office) కాల్‌ చేసి దీనిపై ఫిర్యాదు చేయాలని విమర్శించారు. ఇంత డబ్బుతో నలుగురు పేద అమ్మాయిలకు పెళ్లిళ్లు చేసి ఉండేవారని మరొకరు వ్యాఖ్యానించారు. అయితే దీనిపై ఇంకా పోలీసులు స్పందించలేదు.

Advertisement

Next Story

Most Viewed