పాఠశాలకు తాళం.. వరండాలో విద్యార్థులు..

by Aamani |
పాఠశాలకు తాళం.. వరండాలో విద్యార్థులు..
X

దిశ, మక్తల్: మక్తల్ మున్సిపాలిటీ పరిధిలోని చందాపూర్ పాఠశాల గదులకు కాంట్రాక్టర్ తాళం వేయడంతో టీచర్లు విద్యార్థులను ఆవరణలో కింద కూర్చోబెట్టి పాఠాలు బోధిస్తున్నారు. ఇది గత నెల రోజుల నుండి జరుగుతున్న సంబంధిత విద్యాధికారులు గాని, నాయకులు పాఠశాల గోడును పట్టించుకోవడం లేదు. వివరాల్లోకెళ్తే మక్తల్ మున్సిపాలిటీ లోని చందాపూర్ గ్రామంలో అప్ గ్రేడ్ ప్రాథమికోన్నత గదుల కొరత తీర్చేందుకు సర్వ శిక్ష అభియాన్ కింద గత ప్రభుత్వం రూ. 43 లక్షల నిధులు కేటాయించింది. టెండర్ ను దక్కించుకున్న ఓ కాంట్రాక్టర్ రెండు గదులు నిర్మించే సమయంలో కాంట్రాక్ట్ మృతి చెందాడు.

భవన నిర్మాణం మధ్యలో ఆగిపోవడంతో,పాలకుల గ్రామస్తుల రిక్వెస్ట్ తో పాఠశాల భవనాన్ని మేస్త్రి పూర్తి చేశాడు. భవన నిర్మాణ పూర్తి కాగానే రంగులేసి సిద్ధం చేసిన బిల్లులు రాకపోవడంతో భవనాన్ని నిర్మించిన మేస్త్రి పాఠశాల గదులకు తాళం వేశాడు. తనకు బిల్లులు వచ్చేంతవరకు తను పాఠశాల గదలను తేరవనని కరాఖండిగా చెప్పాడు. ఈ విషయంపై గతంలో పనిచేసి రిటైరైన ఎంఈఓ లక్ష్మీనారాయణ ను వివరణ కోరగా మేస్త్రి చెప్పింది వాస్తవమే అని కాంట్రాక్టర్ చనిపోగా అసంపూర్తిగా ఉన్న భవనాన్ని మేస్త్రి పూర్తి చేశాడని, సర్వ శిక్ష అభియాన్ బాధ్యతలు చూస్తున్న కలెక్టర్ కు నివేదిక పంపించామని న్యాయబద్దంగా బిల్లులను మంజూరు కి జిల్లా కలెక్టర్ చొరవ తీసుకుని బిల్లులు చెల్లిస్తే సమస్య పరిష్కార మవుతుందని అన్నారు.

ప్రైమరీ నుండి ప్రాథమికోన్నత పాఠశాలగా అప్ గ్రేడ్ కావడంతో దాదాపు 150 మంది విద్యార్థులతో కొనసాగుతుండగా అదనపు గదుల నిర్మాణం కోసం వీటిని నిర్మించారు.ఈ పాఠశాలలో ఎనిమిదో తరగతి వరకు కొనసాగుతున్న పాఠశాలకు కేవలం నాలుగు గదులు మాత్రమే అందుబాటులో ఉన్నాయని అదనపు గదులు అందుబాటులోకి వస్తే గదుల కొరత తీరుతుందని, కానీ ఎనిమిది మంది ఉపాధ్యాయులు ఉండాల్సిన చోట నలుగురు టీచర్లతో విద్యార్థులకు పాఠాలు బోధించడం ఇబ్బందిగా మారింది. మక్తల్ ఎంఈవో అనిల్ కుమార్ గౌడ్ ను వివరణ కోరగా బిల్లుల చెల్లింపు .టీచర్ల కొరత విషయాన్ని ఉన్నతాధికారులకు నివేదించా అన్నారు.త్వరలో భవనాన్ని అందుబాటులోకి తెస్తామన్నారు.

Advertisement

Next Story

Most Viewed