Ram Charan:కడప దర్గా వివాదం.. రామ్ చరణ్ వెంటనే బహిరంగ క్షమాపణలు చెప్పాలి:అయ్యప్ప జేఏసీ

by Jakkula Mamatha |   ( Updated:2024-11-20 11:45:08.0  )
Ram Charan:కడప దర్గా వివాదం.. రామ్ చరణ్ వెంటనే బహిరంగ  క్షమాపణలు చెప్పాలి:అయ్యప్ప  జేఏసీ
X

దిశ,వెబ్‌డెస్క్: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం అయ్యప్ప స్వామి మాల ధారణలో ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రామ్ చరణ్ రీసెంట్‌గా కడప దర్గాను సందర్శించడం వివాదస్పదంగా మారింది. ఇస్లాం మతానికి సంబంధించిన దర్గాను ఎవరైనా సందర్శిస్తారు. అందులో ఎలాంటి అభ్యంతరాలు ఉండవు కానీ.. అయ్యప్ప స్వామి మాలలో ఉన్న హీరో రామ్‌చరణ్ దర్గా సందర్శించడం పై అభ్యంతరాలు వెల్లడవుతున్నాయి. ఇందుకు సంబంధించిన చర్చలు ప్రజెంట్ సోషల్ మీడియాలో హట్ టాపిక్‌గా మారింది. దర్గా అంటే సమాధి అని పవిత్రమైన అయ్యప్ప మాల వేసుకుని వెళ్లడం ఏమిటని పలువురు నెటిజన్ల అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఈ ఘటనపై తెలంగాణ అయ్యప్ప జేఏసీ స్పందిస్తూ.. రామ్ చరణ్ వెంటనే బహిరంగ క్షమాపణలు చెప్పాలని కోరారు.

రామ్ చరణ్ ఇటీవల గేమ్ చేంజర్ మూవీని పూర్తి చేసుకున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి కానుకగా రానున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మ్యూజిక్ డైరెక్టర్ ఏ ఆర్ రెహమాన్ పిలుపు మేరకు.. రామ్ చరణ్ కడప దర్గాను సందర్శించినట్లు తెలుస్తొంది. ఈ నేపథ్యంలో అయ్యప్ప మాలలో ఉండి దర్గాకు ఎలా వెళ్తారు?.. ఏ ఆర్ రెహమాన్ కుట్ర పూర్వకంగానే రామ్ చరణ్‌నీ దర్గాకు వెళ్ళమన్నారని అయ్యప్ప జేఏసీ ఆరోపించారు. రామ్ చరణ్ రెహమాన్‌ని కూడా తిరుపతి, శబరిలకు తీసుకరాగలరా? ఒకపక్క పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం గురించి పోరాడుతుంటే ఇంకోపక్క వాళ్ల అబ్బాయి రామ్ చరణ్ అయ్యప్ప మాలలో దర్గాకు వెళ్ళాడని అన్నారు. దీనిపై రామ్ చరణ్ నుంచి సమాధానం కోసం నాలుగైదు రోజులు ఎదురు చూస్తాం.. ఎలాంటి స్పందన లేకపోతే మా ఆందోళనను ఉధృతం చేస్తామని తెలంగాణ అయ్యప్ప జేఏసీ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed