- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజాభిప్రాయ సేకరణ
దిశ, గద్వాల కలెక్టరేట్ : సామాజికంగా,ఆర్థికంగా వెనుకబడిన తరగతుల వారి పరిస్థితులను తెలుసుకోవడానికి బీసీ కమిషన్ చైర్మన్ సభ్యులు ఈనెల 22న ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ ఒక ప్రకటనలో తెలిపారు. కలెక్టర్ కార్యాలయంలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. జోగులాంబ గద్వాల జిల్లాలోని సమస్త వెనుకబడిన తరగతుల ప్రజానీకం బీసీ కమిషన్ బృందానికి ఆయా కులాల స్థితిగతులపై తమ అభిప్రాయాలను అందజేయాలని కోరారు. వ్యక్తులు నమోదు,నమోదు కాని సంఘాలు తమ వాదనలకు మద్దతుగా తమ వద్ద ఉన్న సమాచారం, సమర్పణలు, అభ్యర్థనలు, సలహాలు, ఆక్షేపణలను కమిషన్ ముందు హాజరై తెలియజేయవచ్చని అన్నారు. దరఖాస్తు దారులు ధ్రువీకరణ అపీడవిడ్ రూ.20/- నాన్ జ్యుడీషియల్ స్టాంప్ పేపర్ పై (6) పత్రాలను సమర్పించాలని తెలిపారు. మరిన్ని వివరాలకు ఈ నోటిఫికేషన్ కు సంబంధించి పూర్తి సమాచారం https://www.telangana.gov.in అనే వెబ్ సైట్ పై ప్రకటన లభ్యంగా ఉంటుందని తెలిపారు.