- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
పేదలకే పెద్దపీట : ఎమ్మెల్యే యశస్వినీ రెడ్డి
దిశ, కొడకండ్ల : రైతుల పార్టీ కాంగ్రెస్ పార్టీ అని, కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకే పెద్దపీట వేస్తుందని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాలా యశస్విని రెడ్డి అన్నారు. మండల కేంద్రంలో బుధవారం నూతన మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారానికి ఎమ్మెల్యే హాజరై అనంతరం మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజాపాలన ప్రభుత్వం అని , రైతుల ప్రభుత్వమని, రైతు లేనిదే దేశమే లేదని, రైతును రాజు చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ముఖ్యంగా మహిళలు స్వయం ఉపాధి తో అభివృద్ధి చెందుతున్నారని, మహిళలకు అండగా ఉంటానని, వరంగల్ జిల్లాను ముఖ్యమంత్రి అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారని అలాగే మన పాలకుర్తిని కూడా అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అన్ని నెరవేరుస్తామని, ఇచ్చిన మాటను నెలబెట్టుకుంటున్నమని తెలిపారు.
పేద కుటుంబాలు పిల్లలను ఎక్కడో పోయి చదవించలేరని ఇంటిగ్రేటెడ్ స్కూల్ ను కొడకండ్ల లో నిర్మిస్తున్నామని అన్నారు. నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇండ్లు వచ్చాయని ,అవి కేవలం అరులైన వారికి మాత్రమే ఇస్తామని గత ప్రభుత్వం వలె మొహం చూసి బొట్టు పెట్టమని అన్నారు. అనంతరం నూతన మార్కెట్ కమిటీ చైర్మన్ నల్ల అండాలు శ్రీరాములు, వైస్ చైర్మన్ ఈరేంటి సాయి కృష్ణ , డైరెక్టర్ లను ప్రమాణ స్వీకారం చేయించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పాలకుర్తి ఇన్చార్జి ఝాన్సీ రెడ్డి, పీసీసీ సభ్యులు లక్ష్మీనారాయణ, బ్లాక్ కాంగ్రెస్ నాయకులు రాపాక సత్యనారాయణ , మండల పార్టీ అధ్యక్షుడు సురేష్ నాయక్ , ప్రవీణ్ రావు, గిరగాని కుమార్, రాజేష్ నాయక్ , అందే యాకయ్య తదితరులు పాల్గొన్నారు.