AR Rahman Divorce: విడాకులపై ఏఆర్ రెహమాన్ హ్యాష్ ట్యాగ్.. అవసరమా? అంటున్న నెటిజన్లు

by Rani Yarlagadda |   ( Updated:2024-11-20 12:42:46.0  )
AR Rahman Divorce: విడాకులపై ఏఆర్ రెహమాన్ హ్యాష్ ట్యాగ్.. అవసరమా? అంటున్న నెటిజన్లు
X

దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ సంగీత విద్వాంసుడు ఏఆర్ రెహమాన్-సైరాభాను విడాకుల (Rahman-Saira Divorce) ప్రకటన.. సినీ ఇండస్ట్రీనే కాదు.. యావత్ దేశాన్ని షాక్ కు గురిచేసింది. నిన్న రాత్రి సైరా భాను తరఫు లాయర్ వారి విడాకులను ప్రకటించగా.. దానిపై అర్థరాత్రి ఏఆర్ రెహమాన్ (AR Rahman) ఎక్స్ వేదికగా స్పందించారు. 29 ఏళ్ల తమ వివాహ బంధం.. గ్రాండ్ థర్టీకి చేరుకుంటామని ఆశించిన తమకు ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుందనుకోలేదని పేర్కొన్నారు. ముగింపు అంటే ఏంటో తెలియని తమ బంధానికి ముగింపు పలకక తప్పలేదన్నారు. తమకు ప్రైవసీ కావాలని, తమ నిర్ణయాన్ని అందరూ గౌరవిస్తారని భావిస్తున్నట్లు ఆ పోస్టులో రాసుకొచ్చారు రెహమాన్.

రెహమాన్ దంపతుల విడాకుల ప్రకటన ఆయన అభిమానుల్ని కలచివేసింది. ఇటీవలే పెళ్లిళ్లు చేసుకుని.. 2-3 సంవత్సరాలకే విడాకులు తీసుకుంటున్నారంటే.. ఈ జనరేషన్ అలాగే ఉందిలే అనుకోవచ్చు కానీ.. 29 ఏళ్లు కలిసి ఉన్న దంపతులు విడిపోవడం అంత సాధారణమైన విషయం కాదు. సరే.. వాళ్లిద్దరి మధ్య ఏవో గొడవలు వచ్చాయి. మనస్పర్థల కారణంగా విడిపోయారు. ఆ కారణాలను బయటికి చెప్పడం చెప్పకపోవడం వారి ఇష్టం. విడాకులు అనేది చాలా సున్నితమైన అంశం. తమకు ప్రైవసీ కావాలంటూనే ఏఆర్ రెహమాన్.. ఆ పోస్టుకు ఒక హ్యాష్ ట్యాగ్ క్రియేట్ చేయడంపై నెట్టింట చర్చ జరుగుతోంది.

#arrsairaabreakup హ్యాష్ ట్యాగ్ ను జోడించడంపై అభిమానులు, నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. ఆయనకు ప్రైవసీ కావాలన్నప్పుడు ఈ హ్యాష్ ట్యాగ్ ఎందుకు పెట్టారని ఒక నెటిజన్ కామెంట్ చేస్తే.. AR రెహమాన్ తమ విడాకులను ప్రకటించడానికి హ్యాష్‌ట్యాగ్‌ని సృష్టించిన సంవత్సరంగా 2024 చరిత్రలో నిలిచిపోతుంది అని మరో నెటిజన్ రాసుకొచ్చాడు. ఇంకొకరు.. రెహమాన్ ఎక్స్ ఖాతాను ఎవరు వాడుతున్నారో తెలియదు కానీ.. గోప్యత కావాలన్నప్పుడు ఈ హ్యాష్ ట్యాగ్ ను సృష్టించి ఉండకూడదని కామెంట్ చేశాడు.

విడాకులపై ఒక హ్యాష్ ట్యాగ్ క్రియేట్ చేసి.. ప్రైవసీ కావాలని అడగడం హాస్యాస్పదంగా ఉందంటున్నారు నెటిజన్లు. అసలు దాన్ని ఎందుకు క్రియేట్ చేశారని కొందరు అయోమయానికి గురయ్యారు. ఒకరైతే.. మీ విడాకుల కోసం ఒక హ్యాష్ ట్యాగ్ కూడానా ? అని ప్రశ్నించారు. నెటిజన్లు అడిగిన దానిలో తప్పు లేదు. ప్రైవసీ కావాలనుకున్న రెహమాన్.. ఆ హ్యాష్ ట్యాగ్ పెట్టి ఉండాల్సింది కాదు. అసలు ఆ ఖాతానుండి ఆయనే ఈ పోస్ట్ పెట్టారా ? లేక ఆయన టెక్నికల్ టీమ్ పెట్టిందా ? అన్న అనుమానం కూడా ఉంది. ఏదేమైనా విడాకులపై రెహమాన్ ఒక హ్యాష్ ట్యాగ్ ను క్రియేట్ చేయడంపై నెట్టింట పెద్ద చర్చే జరుగుతోంది.

Advertisement

Next Story

Most Viewed