- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Indegene Limited: హైదరాబాద్లో కొత్త కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్న ఇండీజీన్..!
దిశ, వెబ్‌డెస్క్: హెల్త్ కేర్ సెక్టార్(Health care sector)లోని కంపెనీలకు టెక్నికల్ సర్వీసెస్(Technical Services) అందించే ఇండీజీన్ లిమిటెడ్(Indegene Limited) తన గ్లోబల్ డెలివరీ కార్యకలాపాలను మరింత బలోపేతం చేసుకుంటోంది. ఇందులో భాగంగా హైదరాబాద్(HYD)లో కొత్త కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ఫార్మా వ్యాపార అవసరాలను మెరుగుపరచడానికి, కొత్త పరిస్థితులకు అనుగుణంగా మారడానికి సంబంధించి ఫార్మా పరిశ్రమపై ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో కంపెనీలకు సహాయం అందించడంలో ఈ కొత్త సెంటర్ కీలక పాత్ర పోషించనుందని ఇండీజీన్ తెలిపింది. కాగా ఇండీజీన్ సంస్థను 1998లో స్థాపించారు. ఈ సంస్థకు నార్త్ అమెరికా(North America), యూరప్(Europe), ఆసియా(Asia) ఖండాలలో 6 హబ్(Hub)లు, 18 కార్యాలయాలు(Offices) ఉన్నాయి. ఈ కంపెనీ బయోఫార్మా, బయోటెక్, వైద్య పరికరాల తయారీ రంగంలోని సంస్థలకు టెక్ ఆధారిత సేవలు అందిస్తోంది.