- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
30 రోజుల్లో సెకండ్ మ్యారేజ్.. ‘డబుల్’ పెళ్లి చేసుకోని నిరూపించిన నవ దంపతులు!
దిశ, వెబ్‌డెస్క్: ఈ రోజుల్లో ఒక్కసారి పెళ్లి చేసుకోవాలంటేనే లక్షల ఖర్చు అవుతుంది. కానీ ఒకే జంట నెల రోజుల్లోనే రెండు సార్లు పెళ్లి చేసుకోని అందరికీ షాక్ ఇచ్చింది. కానీ వాళ్లు అట్టహాసంగా ఖర్చు పెట్టి పెళ్లి చేసుకోలేదు. కేవలం ప్రభుత్వం ఇచ్చే సొమ్ము, నజరానాలకు ఆశపడి 30 రోజుల్లో సెకండ్ మ్యారేజ్ చేసుకోని వార్తల్లోకెక్కారు. ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఈ కన్నింగ్ పెళ్లికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
మధురలో జిల్లాలో సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రెండురోజుల క్రితం బీఎస్‌ఏ ఇంజినీరింగ్ కళాశాలలో ముఖ్యమంత్రి సామూహిక వివాహ వేడుకలు నిర్వహించారు. ఈ పథకం ద్వారా కొత్తగా పెళ్లి చేసుకున్న జంటలకు రూ.35 వేల నగదుతోపాటు పెళ్లి ఖర్చుకు రూ.5 వేలు, గృహోపకరణాలకు రూ.10 వేలు అందజేశారు. దీంతోపాటు నధువరుల కుటుంబాలకు చెందిన బంధుమిత్రులకు విందు ఏర్పాట్లు కూడా చేశారు. తాజాగా జరిగిన వివాహ మహోత్సవాల్లో 142 జంటలకు పెళ్లీలు జరిగాయి. వీరిలో 136 మంది హిందువులు కాగా, ఆరు ముస్లిం జంటలు ఉన్నాయి. వీరందరికీ ప్రభుత్వం తరుఫున అధికారులు నజరానాలు అందజేశారు.
ఇంతవరకు బాగానే ఉన్నా.. ఈ సాముహిక వివాహ మహోత్సవంలో ఓ మోసం వెలుగు చూసింది. నెల రోజుల క్రితమే పెళ్లి చేసుకున్న ఓ జంట మళ్లీ వివాహం చేసుకోవడం సంచలనంగా మారింది. గత నెలలో జరిగిన ముఖ్యమంత్రి సామూహిక వివాహ వేడుకల్లోనే ఈ జంట వివాహం చేసుకుంది. పెళ్లి తంతు అనంతరం గవర్నమెంట్ అందించిన నగదు,కానుకులను అందుకుంది. మళ్లీ శనివారం జరిగిన కార్యక్రమంలోనూ ఇదే జంట రెండోసారి పెళ్లి చేసుకోవడాన్ని స్థానికులు గుర్తించారు. వెంటనే నెల రోజుల క్రితం తీసిన ఫొటోలు, పెళ్లి ఆహ్వాన పత్రికను, తాజా పెళ్లి ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో సెకండ్ మ్యారెజ్ బాగోతం బయటపడింది. ప్రభుత్వం అందించే నగదు, గిఫ్ట్‌ల కోసమే ఈ జంట మళ్లీ పెళ్లిచేసుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు. మరి అధికారులు వీరిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.