- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Sardar Papanna ఫ్లెక్సీల వివాదం.. నలుగురు మృతి.. 144 సెక్షన్ అమలు
దిశ, వెబ్‌డెస్క్: తూర్పు గోదావరి తాడిపర్రులో సర్దార్ పాపన్న (Sardar Papanna) విగ్రహ వివాదం సమసిన వెంటనే తాజాగా ఫ్లెక్సీలు కడుతూ నలుగురు మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. సర్దార్ పాపన్న గౌడ్ విగ్రహ ఏర్పాటుకు గౌడ సామాజిక వర్గం గత 18 నెలలుగా ప్రయత్నిస్తున్నా.. స్థానికంగా ఉన్న మరో వర్గం విగ్రహ ఏర్పాటును వ్యతిరేకిండంతో పాటు స్థల వివాదం కొనసాగుతుండడంతో విగ్రహం ఏర్పాటు సాధ్యపడలేదు. అయితే తాజాగా జిల్లా అధికారులు, నాయకులు శాంతియుతంగా ఇరు వర్గాలతో చర్చించి కమిటీ వేసి కొన్ని నిబంధనలు విధించి విగ్రహ ఏర్పాటుకు అనుమతిచ్చారు. దీంతో సర్దార్ పాపన్న విగ్రహావిష్కరణకు లైన్ క్లియర్ అయింది.
నిన్న (సోమవారం) ఉదయం ఒకప్పటి హీరో సుమన్ (Suman) చేతుల మీదుగా విగ్రహావిష్కరణ జరగాల్సి ఉంది. దీనికోసం అన్ని ఏర్పాటు కూడా పూర్తయ్యాయి. అయితే తెల్లవారుఝామున గౌడ్ వర్గానికి ఏడుగురు యువకులు తమ ఫోటోలతో రూపొందించిన 20 అగుడుల ఫ్లెక్సీని ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యారు. అదే టైంలో పైన ఉన్న సింగిల్ ఫేజ్ విద్యుత్ వైర్ ఫ్లెక్సీ ఐరన్ ఫ్లెక్సీకి టచ్ కావడంతో ఒక్కసారిగా వారందరూ కరెంట్ షాక్ (Electric shock) తిన్నారు. దంతో ఫ్లెక్సీ పట్టుకున్న బొల్లా వీర్రాజు(26), పామర్తి నాగేంద్ర(25), మారిశెట్టి మణికంఠ(26), కాసగాని కృష్ణ(25) అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనలో తీవ్రంగా గాయపడిన కోమటి అనంతరావును కాకినాడ, స్వల్పగాయాలపాలైన ఇద్దరిని తణుకు ప్రభుత్వాసుత్రికి తరలించారు. ఆసుపత్రిలో మృతదేహాలను మంత్రి దుర్గేష్ పరిశీలించారు. విషయం తెలిసిన వెంటనే మంత్రి గొట్టిపాటి రవికుమార్ బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని విద్యుత్‌శాఖ కూడా తెలిపింది.
ఇదిలా ఉంటే పరిస్థితిని అదుపు చేసేందుకు డీఎస్పీ దేవకుమార్ నేరుగా రంగంలోకి దిగి పరిస్థితులను సమీక్షిస్తున్నారు. ఏరియా మొత్తం 144 సెక్షన్ అమలు చేయడమే కాకుండా 130 మంది పోలీసులతో పికెట్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు.