- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
గచ్చిబౌలి విప్రో సర్కిల్ వద్ద రోడ్డు ప్రమాదం...ఇద్దరు మృతి
దిశ, శేరిలింగంపల్లి : డివైడర్ ను ఢీకొని ఇద్దరు యువకులు మృతి చెందిన ఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విశాఖపట్నంకు చెందిన పిల్లి దేవరకుమార్ (25), వెంకన్న స్వామి (30)లు గాజులరామారంలో నివాసం ఉంటూ అమెజాన్ కంపెనీలో డెలివరీ బాయ్స్ గా పనిచేస్తున్నారు. దేవకుమార్ తన స్నేహితుడితో కలిసి గురువారం రాత్రి రెండు గంటల సమయంలో త్రిబుల్ ఐటీ చౌరస్తా నుంచి విప్రో సర్కిల్ మార్గంలో అతి వేగంగా వెళ్తున్న క్రమంలో బైక్ అదుపుతప్పి డివైడర్ ను ఢీ కొన్నాడు. తీవ్ర గాయాలు కావడంతో దేవకుమార్ అక్కడికక్కడే మృతి చెందగా.. తీవ్రంగా గాయపడిన వెంకన్న స్వామి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. విషయం తెలుసుకున్న గచ్చిబౌలి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఉస్మానియా హాస్పిటల్ కు తరలించారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న గచ్చిబౌలి పోలీసులు ప్రమాద ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.