ఒంటరిగా ఉన్న మైనర్ బాలికపై అత్యాచారయత్నం..

by Satheesh |
ఒంటరిగా ఉన్న మైనర్ బాలికపై అత్యాచారయత్నం..
X

దిశ, తిరుమలాయపాలెం: మైనర్ బాలికపై అత్యాచారయత్నం చేసిన యువకుడిపై తిరుమలాయపాలెం పోలీస్ స్టేషన్లో పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు వివరాల ప్రకారం.. మండల పరిధిలోని జల్లేపల్లి గ్రామానికి చెందిన గురాల రమేశ్ (21) అదే గ్రామానికి చెందిన పద్నాలుగు సంవత్సరాల మైనర్ బాలికపై కన్నేశాడు. ఈ క్రమంలో మంగళవారం మధ్యాహ్నం ఒంటరిగా ఉన్న బాలికను అత్యాచారం చేసేందుకు బలవంతంగా లాకెళ్లుతుండగా బాలిక అతడి చెర నుండి తప్పించుకుంది. జరిగిన దారుణాన్ని బాలిక తన తల్లిదండ్రులకు చెప్పింది. ఇదిలా ఉంటే, యువకుడు బాలికపై అత్యాచారయత్నం చేయడమే కాకుండా నిందితుడి కుటుంబ సభ్యులు బాలిక తల్లిదండ్రులపై దాడికి పాల్పడ్డారు. దీంతో మైనర్ బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతడి ఫిర్యాదు మేరకు నిందితుడు రమేశ్, అతడి కుటుంబ సభ్యులతో పాటు మరో 10 మందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై వరాల శ్రీనివాస్ తెలిపారు.

Advertisement

Next Story