- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Vladimir Putin : పుతిన్‌తో వైరం.. ప్రిగోజిన్‌కు సీఐఏ హెచ్చరిక
దిశ, వెబ్‌డెస్క్: ఏకంగా రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో వైరం కారణంగా వాగ్నర్ అధిపతి ప్రిగోజిన్ పేరు ప్రపంచ వ్యాప్తంగా మారుమోగుతోంది. అయితే తిరుగుబాటు ప్రకటించిన ఈ నేతకు సంబంధించి సీఐఏ చీఫ్ డేవిడ్ పేట్రాయస్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రిగోజిన్‌కు ముప్పు పొంచి ఉందన్నారు. తెరచిన కిటికీల వద్ద ప్రిగోజిన్ అలర్ట్‌గా ఉండాలని సూచించారు. అయితే గతంలో పుతిన్ శత్రువులు అనేక మంది తెరచిన కిటికీల నుంచి కింద పడిపోయి చనిపోయారు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఈ కామెంట్స్ చేశారు. ప్రిగోజిన్ కోపంలో రష్యా సైన్యానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు.
ఆ తర్వాత వెనక్కి తగ్గాడు. ప్రాణాలను కాపాడుకున్నా, వాగ్నర్ గ్రూప్ ను పోగొట్టుకున్నాడని డేవిడ్ అన్నారు. బెలారస్ లో కొత్త పరిసరాల్లో ప్రయాణించే క్రమంలో తెరుచుకుని ఉన్న కిటిటీల అప్రమత్తంగా ఉండాలని ప్రిగోజిన్‌కు సూచించారు. రష్యా-ఉక్రెయిన్ వార్ మొదలైన నాటి నుంచి రష్యా కు చెందిన 19 మంది ప్రముఖులు, వ్యాపారులు ప్రాణాలు కోల్పోయినట్లు అక్కడి లెక్కలు చెబుతున్నాయి. కాగా ఇవన్నీ అనుమానాస్పద మరణాలే కావడం విశేషం. క్రెమ్లిన్‌కు ఎదురు నిలిచిన వారంతా ఇలానే ప్రాణాలు కోల్పోయినట్లు చరిత్ర చెబుతోంది. ఓ సీనియర్ జర్నలిస్ట్ మాట్లాడుతూ.. బెలారస్ లోనే ప్రిగోజిన్ ను మట్టుబెట్టినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని తెలిపింది.