- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అర్ధరాత్రి నడిరోడ్డుపై మెడికల్ స్టూడెంట్‌పై పోలీస్ అత్యాచారం..
దిశ, వెబ్‌డెస్క్: కాపాడాల్సిన వ్యక్తే కామాంధుడు అయ్యాడు. బాధితులకు అండగా ఉండాల్సిన బాధ్యతాయుతమైన కానిస్టేబుల్.. వంటరిగా వెళుతున్న యువతిపై లైగింక దాడికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన పుదుచ్చేరిలో చోటు చేసుకుంది. హైదరాబాద్‌కు చెందిన మెడికల్ విద్యార్థిని (21) జిప్మర్‌లో ప్రసిద్ధ మెడికల్ కాలేజీలో జరిగే సెమినార్‌కు హాజరయ్యింది. స్నేహితులతో పాటు ఆమె కూడా పక్కనే ఉన్న హోటల్‌లో ఉంటుంది.
ఈ క్రమంలో రెండు రోజుల క్రితం సెమినార్ ముగించుకుని ఆ యువతి ఒక్కతే రోడ్డుపై నడుచుకుంటూ హోటల్‌కు వెళుతున్న సమయంలో.. అక్కడ ఉన్న కన్నర్ అనే పోలీసు కానిస్టేబుల్, అతని స్నేహితుడు ఆమెను చూశారు. ఒంటరిగా వెళుతున్న యువతిని ఇద్దరు బలవంతంగా నిర్మానుష్య ప్రదేశానికి ఎత్తుకెళ్లారు అత్యాచారానికి పాల్పడ్డారు. సెమినార్‌లో ఆమెతో పాటు ఉండే స్నేహితులు.. యువతి ఇంకా రూమ్‌కి రాలేదని వెతుకుతూ కాలేజీకి వెళ్లారు. దారిలో ఆమెపై అత్యాచారం చేస్తూ కామాంధులు కనిపించారు. వెంటనే వారు కేకలు వెయ్యగా నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. యువతిని వైద్య చికిత్స కోసం జిప్మర్‌కు తరలించారు. ఈ ఘటనపై యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పుదుచ్చేరి పోలీసులు.. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందుతులను గుర్తించారు. అనంతరం పరారీలో ఉన్న వారిని పట్టుకుని కోర్టులో హాజరు పరిచారు.
స్కూల్ టాయిలెట్‌లో బిడ్డకు జన్మనిచ్చిన విద్యార్థిని.. చెత్తకుండీలో పడేసి తిరిగి క్లాస్‌కు..