మర్డర్ కేసును ఛేదించిన పోలీసులు..నిందితులు అరెస్ట్

by Aamani |
మర్డర్ కేసును ఛేదించిన పోలీసులు..నిందితులు అరెస్ట్
X

దిశ,కుత్బుల్లాపూర్ : జగద్గిరిగుట్ట లో బర్త్ డే వేడుకల్లో గొడవ జరిగి మర్డర్ జరిగిన కేసును పోలీసులు ఛేదించారు. బాలానగర్ డివిజన్ ఏసీపీ హన్మంత్ రావు తెలిపిన వివరాల ప్రకారం సంగారెడ్డి జిల్లా కు చెందిన ఎండి నదీమ్ పాషా,జగద్గిరిగుట్ట కు చెందిన మహ్మద్ ఖలీల్, ఏపీ తూర్పు గోదావరి జిల్లా కు చెందిన కట్ట ప్రసాద్ @ వరప్రసాద్ ముగ్గురు స్నేహితులు.వేరు వేరు ప్రాంతాలకు చెందిన వారు. ఉపాధి కోసం నగరానికి వచ్చి జగద్గిరిగుట్ట లోని దీనబంధు కాలనీ,వడ్డేపల్లి ఎంక్లేవ్ లో నివాసం ఉంటున్నారు.పనులలో జరిగే పరిచయాలతో ఫ్రెండ్స్ గా మారారు.ఈ క్రమంలో కట్ట ప్రసాద్ అలియాస్ వరప్రసాద్ బర్త్ డే పార్టీ కోసం తన ఫ్రెండ్స్ ను ఆహ్వానించాడు.

వడ్డే ఎంక్లేవ్ సమీపంలో గల వైన్స్ షాప్ లో ఫుల్ గా మందు తాగి అర్ద రాత్రి తర్వాత బర్త్ డే వేడుకలు జరుపుకున్నారు.ఈ బర్త్ డే వేడుకలకు హత్యకు గురైన ఎండీ నదీమ్ పాషా తో పాటుగా మహమ్మద్ ఖలీల్ హాజరయ్యారు. బర్త్ డే వేడుకలు అనంతరం ఎండీ నదీమ్ పాషాతో మహమ్మద్ ఖలీల్,కట్ట ప్రసాద్ ల మధ్య మాటా మాటా పెరిగి ఘర్షణ జరిగింది.13వ తేదీ తెల్లవారుజామున మూడు గంటల సమయంలో మహమ్మద్ ఖలీల్, కట్ట ప్రసాద్ లు దీనబంధు కాలనీ లోని ఎన్ టీ ఆర్ విగ్రహం చౌరస్తా వద్ద ఎండి నదీమ్ ను రాడ్లతో కొట్టి హత్య చేసి పరారయ్యాడు.స్థానికుల సమాచారం మేరకు సంఘటన స్థలానికి వెళ్లిన పోలీసులు నదీమ్ ను హాస్పిటల్ కు తరలించగా అప్పటికే మృతి చెందాడు.

కేసు నమోదు చేసుకున్న జగద్గిరిగుట్ట పోలీసులు నిందితుల కోసం గాలింపు చేపట్టారు. ఫోన్ సిగ్నల్స్ ట్రేస్ చేసి నిందితులు మహమ్మద్ ఖలీల్ పాషా, కట్ట ప్రసాద్ లను సోమవారం అరెస్టు చేసి వారి నుంచి మొబైల్ ఫోన్స్, హత్యకు వాడిన వెపన్స్ ను సీజ్ చేసి జ్యుడీషియల్ రిమాండ్ కు తరలించారు.విలేకరుల సమావేశంలో జగద్గిరిగుట్ట ఎస్ హెచ్ ఓ నర్సింహా, స్టేషన్ డిటెక్టీవ్ ఇన్స్పెక్టర్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed