రన్నింగ్ కారులోనే మహిళపై గ్యాంగ్ రేప్.. ఇద్దరు నిందితులు అరెస్ట్!

by Satheesh |   ( Updated:2023-02-20 16:16:38.0  )
రన్నింగ్ కారులోనే మహిళపై గ్యాంగ్ రేప్.. ఇద్దరు నిందితులు అరెస్ట్!
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని నార్సింగ్‌లో ఆదివారం ఉదయం ఓ వివాహితను కిడ్నాప్ చేసిన దుండగులు.. కారులోనే గ్యాంగ్ రేప్‌కు పాల్పడిన విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఘటనలో బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టారు. కేవలం 24 గంటల్లోనే ఇద్దరిని అరెస్ట్ చేసి కేసులో పోలీసులు పురోగతి సాధించారు. మహిళను కిడ్నాప్ చేసి కారులోనే దారుణానికి ఒడిగట్టిన నిందితుల్లో తాజాగా ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు.

నిందితులు బాచుపల్లికి చెందిన శుభంశర్మ, సుమిత్ శర్మలను అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. మొదట మహిళను కిడ్నా్ప్ చేసిన దుండగులు.. బలవంతంగా బాధితురాలికి మద్యం తాగిపించారు. అనంతరం మద్యం మత్తులో స్పృహా కోల్పోయిన వివాహితపై కారులోనే అత్యాచారానికి పాల్పడ్డారని తెలిపారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి : భర్త, అత్తను చంపి.. ముక్కలుగా నరికి

Advertisement

Next Story