Sachin Kurmi: ఎన్సీపీ నేత దారుణ హత్య

by Y.Nagarani |
Sachin Kurmi: ఎన్సీపీ నేత దారుణ హత్య
X

దిశ, వెబ్ డెస్క్: మహారాష్ట్రలో ఎన్సీపీ నేత దారుణ హత్యకు గురయ్యారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. అజిత్ పవార్ వర్గానికి చెందిన ఎన్సీపీ (NCP) నేత సచిన్ కుర్మీ (Sachin Kurmi)ను గుర్తు తెలియని వ్యక్తులు పదునైన ఆయుధంతో పొడిచి చంపినట్లు ముంబై పోలీసులు వెల్లడించారు. శుక్రవారం అర్థరాత్రి 12 గంటల సమయంలో నగరంలోని బైకుల్లా ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరే సమయానికి సచిన్ తీవ్రగాయాలతో రక్తపుమడుగులో కనిపించాడు. వెంటనే పోలీస్ వాహనంలో చికిత్స కోసం జేజే ఆస్పత్రి (JJ Hospital)కి తరలించగా.. అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్థారించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని, మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సచిన్ కుర్మీని చంపిందెవరు ? దాని వెనుక ఉన్న కారణాలు ఏంటి ? అన్న కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సమీపంలో ఉన్న సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి అనుమానితులను విచారణ చేసేందుకు రంగం సిద్ధం చేశారు.

సచిన్ కుర్మీ ప్రస్తుతం బైకుల్లా కు ఎన్సీపీ అధ్యక్షుడిగా ఉన్నాడు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ముంబై అధ్యక్షుడు సమీర్ భుజబల్.. కుర్మీ కుటుంబ సభ్యులను పరామర్శించారు. సచిన్ కుర్మీ హత్యపై ఎన్సీపీ మద్దతుదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed