- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హత్య కేసు ఛేదించిన ములుగు పోలీసులు
దిశ, ములుగు ప్రతినిధి: ఈనెల 22న మధ్యాహ్నం సమయంలో ములుగు మండలం బండారు పల్లి రోడ్డు లో గల ఓపెన్ ప్లాట్ లో హత్యకు గురైన ఓర్సు శ్రీను హత్య కేసును ములుగు పోలీసులు ఛేదించి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులకు తెలిపిన వివరాల ప్రకారం… ఓర్సు శ్రీను భార్య ఓర్సు స్వప్న, బుర్ర సంతోష్ అనే వ్యక్తి తో గత కొంతకాలం నుంచి అక్రమ సంబంధం పెట్టుకుంది. వారి అక్రమ సంబంధానికి భర్త అడ్డుగా ఉంటున్నాడని, తాగుడుకు బానిసై తరచు తనని వేధింపులకు గురించేస్తున్నాడానే నెపంతో శ్రీను భార్య, బుర్ర సంతోష్ లు కలిసి శ్రీను ను చంపాలని ప్లాన్ వేశారు. పథకం ప్రకారం, శ్రీను భార్య బుర్ర సంతోష్ కు డబ్బులు రూ. 30,000 ఇచ్చి అతని స్నేహితుడైన ఆకుల అనిల్, అతని స్నేహితుడు బెల్లంకొండ చంద్రమోహన్ ల సహాయం తీసుకున్నారు.
శ్రీను భార్య స్వప్న, శ్రీను ను మేడారం వెళ్లి దర్శనం చేసికుందాం అని వారి పథకం ప్రకారం ఈ నెల 21 రాత్రి 8:00 గంటలకు హనుమకొండ నుండి శ్రీను, అతని భార్య, అనిల్, చంద్రమోహన్ లు ఆటోలో, బుర్ర సంతోష్ ఆటో వెనుక కారులో బయలుదేరి రాత్రి 11:30 గంటలకు ములుగు చేరుకున్నారు. శ్రీను కి మద్యం తాగించి, తనతో గొడవపడి, పెద్ద బండ రాయితో తలపై కొట్టి చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత అక్కడి నుంచి పారిపోవడం జరిగింది అని తెలిపారు. ఓర్సు శ్రీను హత్య కేసులో ఏ1 ఓర్సు స్వప్న, ఏ2 బుర్ర సంతోష్, ఏ3 ఆకుల అనిల్, ఏ4 బెల్లంకొండ చంద్రమోహన్ లను ములుగు పోలీసులు అదుపులోకి తీసుకొని రిమాండ్ కు తరలించారు. కేసు నమోదైన 24 గంటలలోనే నిందితులను గుర్తించి వారిని పట్టుకోవడంలో ప్రతిభ కనబరచిన పోలీస్ అధికారులను ములుగు జిల్లా ఎస్పీ అభినందించారు.