గోదావరిలోకి చిన్నారిని విసిరేసిన కన్నతల్లి

by Shiva |
గోదావరిలోకి చిన్నారిని విసిరేసిన కన్నతల్లి
X

పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో ఘటన

దిశ, గోదావరి ఖని : కన్న కూతరురిని గోదవరిలోకి విసిరేసి తల్లి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన పెద్దపల్లి జిల్లా పరిధిలోని గోదవరి ఖనిలో మంగళవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మంచిర్యాల జిల్లాకు చెందిన బొక్య రమేష్, సెంటినరీ కాలనీకి చెందిన ప్రియాంకకు వివాహం జరిగింది. అయితే, రమేష్ శ్రీరాంపూర్ లో సింగరేణి కార్మికుడిగా విధులు నిర్వర్తిస్తూ నాస్పూర్ లోనే నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలోనే ప్రియాంక కు రెండు రోజుల క్రితం ముక్కులో నుంచి రక్తం కారుతోందని పసికందును గోదావరిఖని సింగరేణి ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తీసుకురాగా పరీక్షించిన వైద్యులు ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు.

అయితే, మంగళవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత రెండు నెలల పసికందుతో తల్లి ప్రియాంక ఆటోలో గోదావరి నది వద్దకు వెళ్లి పాపను గోదావరి నదిలో విసిరేసింది. అనంతరం తాను కూడా ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నిస్తుండగా గమనించిన ఆటో డ్రైవర్ వెంటనే ప్రియాంకను కాపాడి రివర్ పోలీసులకు అప్పగించారు. అప్పటికే, గోదావరి నదిలో గల్లంతైన రెండు నెలల పసికందు కోసం జాలర్లు వెతికి వెలిక తీయగా చిన్నారి అప్పటికే ప్రాణాలు విడిచింది.

Advertisement

Next Story