చౌటుప్పల్ లో వలస కార్మికుని ఆత్మహత్య..

by Sumithra |   ( Updated:2023-05-27 17:00:34.0  )
చౌటుప్పల్ లో వలస కార్మికుని ఆత్మహత్య..
X

దిశ, చౌటుప్పల్ టౌన్ : పశ్చిమబెంగాల్ రాష్ట్రానికి చెందిన బుదదేబ్ రే (21) అనే వలస కార్మికుడు చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం చింతలగూడెంలో చోటుచేసుకుంది. స్థానికి ఎస్సై సైదులు తెలిపిన వివరాల ప్రకారం పశ్చిమ బెంగాల్ రాష్ట్రం భగవాన్పూర్ జిల్లా, తూర్పు మిడ్నాపూర్ పరిధిలోని కొత్లపురికి చెందిన బుదాదేబ్ రే అనే యువకుడు తన బావ సందీప్ మైత్రితో కలిసి నెలరోజుల క్రితం జీవనోపాధి కోసం చౌటుప్పల్ కి వలస వచ్చారు. మండల కేంద్రంలోని 132 కేవీ సబ్ స్టేషన్ లో విద్యుత్ లైన్ల ఏర్పాటు కాంట్రాక్టర్ కింద కార్మికులుగా పని కుదుర్చుకున్నారు. రోజూ మాదిరిగానే శుక్రవారం రాత్రి 8 గంటలకు తన బావ సందీప్ మైత్రితో కలిసి బుదదేబ్ రే డ్యూటీ కి వెళ్లాడు.

సుమారు రాత్రి 10 గంటల సమయంలో సందీప్ మైత్రి నిద్రలో ఉండగా కార్యాలయం నుంచి బయటకు వెళ్లాడు. అదే రాత్రి రహదారి పక్కనున్న చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు తన సొంత ఊరిలో ఒక అమ్మాయితో ప్రేమలో పడ్డాడని... తన ప్రేమ విఫలమైందనే మనోవేదనతో ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని అతని బావ సందీప్ మైత్రీ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. మృతదేహాన్ని చౌటుప్పల్ ప్రభుత్వాసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. బుదదేబ్ రే ఆతహత్య విషయాన్ని అతని కుటుంబ సభ్యులకు చేరవేసి కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై సైదులు తెలిపారు.

Advertisement

Next Story