చత్తీస్గడ్ లో భారీ ఎన్కౌంటర్....నలుగురు మావోలు మృతి

by Sridhar Babu |
చత్తీస్గడ్ లో భారీ ఎన్కౌంటర్....నలుగురు మావోలు మృతి
X

దిశ, భద్రాచలం : ఛత్తీస్గడ్ దక్షిణ అబూజ్ మాధ్ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పులలో ఇద్దరు మహిళలతో సహా నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. దంతెవాడ, నారాయణపూర్, బస్తర్, కొండగావ్ జిల్లాలకు చెందినడి ఆర్జీ, ఎస్టీఎఫ్ బృందాలు ఈ ఎన్కౌంటర్లో పాల్గొన్నాయి. ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతం నుండి ఏకే 47, ఎస్ ఎల్ ఆర్ రైఫిల్ తో పాటు ఆటోమేటిక్ మారణాయుధాలు లభ్యమయ్యాయి. కాగా ఈ ఎదురు కాల్పులలో దంతెవాడ డీఆర్జీ హెడ్ కానిస్టేబుల్ సన్ను కరం మృతి చెందాడు. మృతి చెందిన మావోయిస్టుల వివరాలను సేకరించే పనిలో పోలీస్ ఉన్నతాధికారులు ఉన్నారు. భద్రత బలగాలు ఇంకా అడవులను శోధిస్తున్నాయి.

Advertisement

Next Story