కోహ్లీ, రోహిత్ విషయంలో ప్రజలు అవి మర్చిపోయారు.. : యువరాజ్ సింగ్

by Sathputhe Rajesh |
కోహ్లీ, రోహిత్ విషయంలో ప్రజలు అవి మర్చిపోయారు.. : యువరాజ్ సింగ్
X

దిశ, స్పోర్ట్స్ : రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ సాధించిన విజయాలను ప్రజలు మర్చిపోయారని భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ అన్నారు. ఈ మేరకు ఓ జాతీయ మీడియా సంస్థతో యువరాజ్ మంగళవారం మాట్లాడారు. ‘గొప్ప ఆటగాళ్ల గురించి మనం మాట్లాడుతున్నాం. రోహిత్, కోహ్లీలను ఇష్టమొచ్చినట్లు తిడుతున్నాం. గతంలో వారేం సాధించారో ప్రజలు మర్చిపోయారు. ప్రస్తుతం ఉన్న క్రికెటర్లలో వారు గొప్ప ఆటగాళ్లుగా కొనసాగుతున్నారు. అవును వారు ఓడిపోయారు. అద్భుతమైన ప్రదర్శన ఇవ్వలేకపోయారు. మనకన్నా ఎక్కువగా ఈ విషయం వారు బాధ పడుతున్నారు. కోచ్ గంభీర్, సెలక్టర్ అగార్కర్, రోహిత్, కోహ్లీ, బుమ్రా ఇండియా క్రికెట్ భవిష్యత్తుకు ఏం చేస్తే బాగుంటుందో ఆలోచించాలి. ఫామ్‌లో లేని కారణంగా కెప్టెన్ రోహిత్ ఆడలేదు. అదే రోహిత్ గొప్పతనం. అతను గొప్ప కెప్టెన్. గెలుపు ఓటములతో సంబంధం లేకుండా ఎప్పటికీ అతను అత్యుత్తమ సారధిగా నిలుస్తాడు. అతని కెప్టెన్సీలో భారత్ వన్డే వరల్డ్ కప్ ఫైనల్, టీ20 వరల్డ్ కప్ గెలుచుకుంది. నా అభిప్రాయం ప్రకారం.. ప్లేయర్లు రాణించనప్పుడు వారిని తిట్టడం సులభం.. కానీ వారికి మద్దతు తెలపడమే కష్టం.’ అని యువరాజ్ సింగ్ అన్నాడు.

Advertisement

Next Story

Most Viewed