నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే నా ప్రధాన లక్ష్యం : చెన్నూరు ఎమ్మెల్యే

by Aamani |
నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే నా ప్రధాన లక్ష్యం : చెన్నూరు ఎమ్మెల్యే
X

దిశ, చెన్నూరు: నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి తన విజయానికి కృషి చేసిన నియోజకవర్గ ప్రజలకు బహుమతిగా ఇస్తానని స్థానిక ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణం లో రూ. 20 లక్షల నిధులతో నూతనంగా నిర్మించ తలపెట్టిన అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ తో పాటు 1.30 లక్షల నిధులతో మున్సిపాలిటీ పరిధిలో నిర్మించ తలపెట్టిన ప్రైమరీ హెల్త్ సెంటర్ భవనాలకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో 100 కోట్ల నిధులతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని అభివృద్ధి ప్రధాన ధ్యేయంగా ముందుకు సాగుతున్నానని, అంబేద్కర్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయడం ఆనందంగా ఉందని ఆయన అన్నారు.

పట్టణంలో నేతకాని, ముదిరాజ్ భవన నిర్మాణాలకు అతి తొందరలోనే నిధులు మంజూరు చేయించి భవన నిర్మాణ పనులు ప్రారంభిస్తామని ఆయన తెలిపారు. అన్ని వర్గాల సంక్షేమానికి కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని, ఇప్పటికే పట్టణంలో సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులు పూర్తి చేసుకున్నామని గత పది సంవత్సరాల నుండి పట్టణంలో అధ్వాన్నమైన రోడ్లతో ప్రజలు పడుతున్న ఇబ్బందులకు స్వస్తి పలుకుతామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Next Story