ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కావాలని వినతి

by Naveena |
ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కావాలని వినతి
X

దిశ, నందిపేట్ : నందిపేట్ మండల కేంద్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఏర్పాటు చేయాలని గ్రామ అభివృద్ధి కమిటీ,రైతులు అందరూ ఆర్మూర్ అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ రథసారథి పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. నందిపేట్ రైతుల చిరకాల వాంఛ అయిన ప్రాథమిక వ్యవసాయ సంఘం నందిపేట్ లో ఏర్పాటుకు కృషి చేస్తానని వినయ్ కుమార్ హామీ ఇచ్చారు .ఈ కార్యక్రమంలో మండల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మంద మహిపాల్,గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు ఎర్రం మురళి,మాచర్ల చిన్న సాయిలు,సాంబారు నారాయణ రైతులు ఎర్రం నడిపి ముత్యం,కొండాపురం నర్సయ్య,నాగుల ఆశన్న,మంద చిన్నయ్య,మాచర్ల పెద్ద సాయిలు,దమ్మాయి శ్రీను,దమ్మాయి సుధాకర్,నాగ చిన్నయ్య,గడ్డం చిన్నారెడ్డి,ఏషాల పెద్ద చిన్నయ్య,పిరాజి నాగరాజు,బర్ల అదేందర్, సాగర్,బుక లింబన్న, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed