- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Akira Nandan: అకీరా నందన్‌తో ‘ఖుషీ-2’.. క్లారిటీ ఇచ్చిన ఎస్‌జే సూర్య
దిశ, సినిమా: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) తనయుడు అకీరా నందన్(Akira Nandan) సినీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు గత కొద్ది కాలంగా వార్తలు వైరల్ అవుతున్నాయి. ఆయన న్యూయార్క్‌లో ట్రైనింగ్ కూడా తీసుకుంటున్నట్లు సమాచారం. అయితే పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘ఓజీ’(OG) సినిమాలో అకీరా కూడా ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నట్లు టాక్. ఈ మూవీ సుజిత్(Sujith) దర్శకత్వంలో రాబోతుండగా.. దీనిని డీవీవీ దానయ్య(DVV Danayya) నిర్మిస్తున్నారు. అయితే అకీరా ఎంట్రీపై రామ్ చరణ్ కూడా షోలో క్లారిటీ ఇచ్చారు. ఈ క్రమంలో.. తాజాగా, డైరెక్టర్, నటుడు ఎస్ జే సూర్య(S.J. Surya) ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఆసక్తికర కామెంట్స్ చేశారు.
ఇందులో భాగంగా.. అకీరాతో ఖుషీ-2ఏమైనా ప్లాన్ చేస్తారా? అని యాంకర్ ప్రశ్నించగా.. దానికి సూర్య సమాధానమిస్తూ.. ‘‘నటుడిగా నా జర్నీ చాలా కంఫర్ట్‌గా సాగుతోంది. ఇప్పట్లో దర్శకత్వం గురించి ఏమీ ఆలోచించడం లేదు. అయితే లాస్ట్ టైం రాజమండ్రికి వెళ్లినప్పుడు.. అకిరా నందన్‌ను చూశాను. అతడిని ఫ్లైట్‌లో చూశాను అద్భుతంగా అనిపించాడు. పవన్ కళ్యాణ్ గారి లాగానే.. అప్పుడే పుస్తకాలు పట్టుకుని చదువుతున్నాడు. ఒక వేళ ఆ దేవుడు ఛాన్స్ ఇస్తే.. టైం కలిసి వస్తే.. అకిరా నందన్‌తో ఖుషి సీక్వెల్ వర్కవుట్ అవుతుందేమో చూడాలి’’ అని చెప్పుకొచ్చారు. ప్రజెంట్ ఎస్ జే సూర్య కామెంట్స్ నెట్టింట వైరల్ కావడంతో మెగా అభిమానులు ఖుషీ అవుతున్నారు.