Asaram Bapu : ఆశారాంకు మధ్యంతర బెయిల్.. వారిని కలవొద్దని ఆదేశాలు

by Sathputhe Rajesh |
Asaram Bapu : ఆశారాంకు మధ్యంతర బెయిల్.. వారిని కలవొద్దని ఆదేశాలు
X

దిశ, నేషనల్ బ్యూరో : రేప్ కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న వివాదాస్పద స్వామిజీ ఆశారాం బాపు(86)నకు సుప్రీం కోర్టు మంగళవారం మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అనారోగ్య సమస్యల కారణంగా మార్చి 31 వరకు బెయిల్ మంజూరు చేస్తున్నట్లు కోర్టు తెలిపింది. బెయిల్‌పై విడుదలైన అనంతరం తన అనుచరులను కలవొద్దని అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఆశారాం బాపు గుండె, వృద్ధాప్య సమస్యలతో బాధ పడుతున్నట్లు ఎంఎం సుందరేశ్, రాజేష్ బిందాల్‌లలో కూడిన ధర్మాసనం పేర్కొంది . ఆశారాం హార్ట్ పెషెంట్ అని గతంలో గుండె పోటు సైతం వచ్చినట్లు ధర్మాసనం తెలిపింది. తన ఆరోగ్యాన్ని పర్యవేక్షించేందుకు ఒక వ్యక్తిని నియమించాలని ఈ సందర్భంగా సుప్రీం కోర్టు ఆదేశించింది. ప్రస్తుతం జోద్‌పూర్ సెంట్రల్ జైలులో ఉన్న ఆశారాం స్థానిక ఆరోగ్య వైద్య కేంద్రంలో చికిత్స పొందుతున్నారు. 2023లో టీనేజీ యువతిపై, 2013లో ఓ మహిళపై తన ఆశ్రమంలో అత్యాచారం చేసిన కేసుల్లో ఆయనకు జోద్‌పూర్ కోర్టు ఆయనకు జీవిద ఖైదు విధించిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story