గోదావరిలో చిల్లర నాణాల కోసం వెళ్లి.. తిరిగి రాని లోకాలకు..

by Sumithra |
గోదావరిలో చిల్లర నాణాల కోసం వెళ్లి.. తిరిగి రాని లోకాలకు..
X

దిశ, భీమ్‌గల్‌ : మెండోరా మండలం పోచంపాడ్ గ్రామానికి చెందిన మొహమ్మద్ మూస(35) అనే వ్యక్తి గోదావరి నదిలోమునిని మృతి చెందాడు. ఏఎస్సై మురళీధర్ రాజు తెలిపిన వివరాల ప్రకారం శుక్రవారం సాయంత్రం గోదావరి నది నీటిలో భక్తులు వేసే చిల్లర నాణాలు ఏరుకుంటూ పోయి నీట మునిగాడు. ఆదివారం మధ్యాహ్నం సమయంలో మృతదేహం నీటిలో తేలడం చూసిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.

దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటికి తీశారు. మృతదేహం కుళ్ళిన స్థితిలో ఉండడంతో సంఘటనా స్థలంలోనే పోస్టు మార్టం చేసి కుటుంబీకులకు అప్పగించారు. మృతుని భార్య రెహనా బేగం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతునికి కొడుకు, కూతురు ఉన్నారు.

Advertisement

Next Story