- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం ఐక్యంగా ముందుకు సాగాలి : ఎమ్మెల్యే సునీతా
దిశ, శివంపేట : వచ్చే స్థానిక సంస్థ ఎన్నికల్లో పార్టీ బలోపేతంతో పాటు గెలుపు కోసం కృషి చేయాల్సిన అవసరం ఉన్నదని ఎమ్మెల్యే వాకిటి సునీతా లక్ష్మారెడ్డి పార్టీ నాయకులకు కార్యకర్తలకు సూచించారు. శివంపేట మండలంలోని దొంతి గ్రామ బీఆర్ ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులుగా ఎల్ఐసీ చిగుళ్లపల్లి శ్రీనివాస్, ఉపాధ్యక్షులుగా ఎండీ లాయకు ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా దొంతిలోని జీవన్ దివ్య ఫంక్షన్ హాల్లో జరిగిన కార్యకర్తల సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగిస్తూ రానున్న స్థానిక ఎన్నికల్లో గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ పటిష్టం గా ఉండడానికి అందరూ కృషి చేయాలని సూచించారు. ఎప్పుడు నేను ప్రజలకు అందుబాటులో ఉంటానని ప్రజల కష్టసుఖాల్లో పాలు పంచుకుంటానని ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి భరోసా కల్పించారు. ఎప్పుడు ఫోన్ చేస్తే అప్పుడే స్పందిస్తానని ఆమె పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేయకుండా రూ. 500 కే గ్యాస్ అని చెప్పి మోసపూరిత మాటలతో అధికారంలోకి వచ్చిందని ఆమె ఆరోపించారు.
ప్రజల కోసం 6 గ్యారంటీ పథకాలు అమలు చేసి చూపిస్తామని చెప్పి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైందని అన్నారు. గ్రామాల్లోనూ ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలను చైతన్యవంతం చేయవలసిన అవసరం ఉందని నాయకులకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. దొంతి గ్రామ బీఆర్ఎస్ పార్టీ నూతన అధ్యక్షులుగా చిగులపల్లి శ్రీనివాస్ గుప్తా, ఉపాధ్యక్షులుగా ఎండి లాయకులను ప్రత్యేకంగా అభినందించారు. ముందుగా వారిని శాలువాలతో ఘనంగా సన్మానించి అభినందించారు. ఈ సమావేశంలో మాజీ ఎంపీపీ హరికృష్ణ, జిల్లా గ్రంథాలయం మాజీ చైర్మన్ చంద్ర గౌడ్, జెడ్పీ మాజీ సభ్యులు ఎండి మన్సూర్, ఎండి లాయకు, పార్టీ నాయకులు రమణ గౌడ్, కె యాదగౌడ్, ములుగు నాగేశ్వరరావు, సత్యనారాయణ, కోదాస్ కుమార్, స్వామి, ముత్యాలు, ఎండి కైఫ్, సుకుమార్, వంజరి రాహుల్ .. గ్రామ శాఖ నాయకులు కార్యకర్తలు, మహిళలు, తదితరులు పాల్గొన్నారు.