- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Gandhi Tata Chettu: వచ్చేస్తున్న ‘గాంధీ తాత చెట్టు’.. హైప్ పెంచే విధంగా బాలిక పోస్టర్
దిశ, సినిమా: స్టార్ డైరెక్టర్ సుకుమార్ (Sukumar) బండ్రెడ్డి తనయురాలు సుకృతి వేణి బండ్రెడ్డి (Sukriti Veni Bundreddy) ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘గాంధీ తాత చెట్టు’ (Gandhi Tata Chettu). మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, గోపీ టాకీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి పద్మావతి మల్లాది (Padmavati Malladi) దర్శకత్వం వహిస్తున్నారు. నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్, శేష సింధురావు నిర్మాతలు. ఇప్పటికే ఈ చిత్రం పలు అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శింపబడి ఎన్నో అవార్డులు కైవసం చేసుకుంది. ఉత్తమ బాల నటిగా సుకృతి వేణి కూడా పురస్కారం పొందారు.
కాగా ఇప్పుడు ఈ చిత్రం థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమైంది. ఈ విషయాన్ని తెలిజేస్తూ అఫీషియల్ అనౌన్స్ చేస్తూ.. జనవరి 24న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానున్నట్లు తెలియజేశారు. ఈ సందర్భంగా డైరెక్టర్ పద్మావతి మల్లాది మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం ప్రపంచంలో ఎక్కడా చూసిన ద్వేషాలు, అసూయ.. ఇలా ఓ నెగెటివ్ వైబ్రేషన్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక సాధారణంగా మనకు అహింస అనగానే మనకు మన జాతిపిత మహాత్మగాంధీ గుర్తొస్తారు. ఇలాంటి తరుణంలో గాంధీ గారి సిద్ధాంతాలు అభిమానిస్తూ, ఆయన బాటను అనుసరించే ఓ పదమూడేళ్ల అమ్మాయి తను పుట్టిన ఊరిని కాపాడుకోవడం కోసం ఏం చేసింది? అనేది ఈ కథ. ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు చూపించాల్సిన సినిమా. అందరి హృదయాలను హత్తుకునే భావోద్వేగాలు ఈ చిత్రంలో ఉంటాయి’ అని చెప్పుకొచ్చారు.