జిల్లాలో 30 పోలీస్ యాక్ట్ అమలు

by Sridhar Babu |
జిల్లాలో 30 పోలీస్ యాక్ట్ అమలు
X

దిశ, ఆసిఫాబాద్ : శాంతిభద్రతల దృష్ట్యా జిల్లాలో జనవరి 31వరకు 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుందని జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు బుధవారం తెలిపారు. 30 పోలీస్ యాక్ట్-1861 అమల్లో ఉన్నందున జిల్లాలో డీఎస్పీ లేదా ఆపై పోలీస్ ఉన్నతాధికారుల నుండి ముందస్తు అనుమతి లేకుండా ఎలాంటి సమావేశాలు, ధర్నాలు, ఊరేగింపులు, సభలు నిర్వహించినా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించా రు. నిషేధంలో ఉన్న నిబంధనలను తప్పనిసరిగా అందరూ పాటించాలని కోరారు. ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించాలన్నా ముందస్తుగా దరఖాస్తు చేసుకొని అనుమతులు పొందాలని సూచించారు.

Advertisement

Next Story

Most Viewed