- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
నకిలీ మందులు తయారీపై హెల్త్ మినిస్టర్ సంచలన వ్యాఖ్యలు
దిశ, తెలంగాణ బ్యూరో : నకిలీ మందులు తయారు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెల్త్ మినిస్టర్ దామోదర రాజనర్సింహా పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే మెడిసిన్స్ పై ఫోకస్ పెంచాలని డ్రగ్ అధికారులకు సూచించారు. బుధవారం ఆయన డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ ఆధ్వర్యంలో రూపొందించిన వార్షిక రిపోర్టును ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..రాష్ట్రంలో డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ ను బలోపేతం చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో నిషేధిత, నకిలీ మందులు తయారు చేస్తున్న కంపెనీలు, సంస్థలపై ఫోకస్ పెంచామన్నారు. అంతేగాక ధరల్లో నిబంధనలు ఉల్లంఘించినా చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇక ఇతర రాష్ట్రాల నుండి అక్రమంగా రాష్ట్రానికి సరఫరా చేస్తున్న డ్రగ్స్ రాకెట్ లకు చెక్ పెడతామన్నారు. ఫోకస్డ్ గా మానిటరింగ్ చేసేందుకు స్పెషల్ ప్లాన్ తయారు చేస్తున్నామన్నారు. 2024 లో డ్రగ్ కంట్రోల్ పనితీరు అద్భుతంగా ఉన్నదన్నారు. 2023లో కేవలం 56 కేసులు నమోదు కాగా, 2024 లో 573 కేసులు రికార్డు అయ్యాయని వివరించారు. అనుమతులు లేని మెడికల్, ఫార్మా కంపెనీలపై చర్యలు వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మందుల కొనుగోలులో ప్రజలు అవగాహన పెంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ జనరల్ కమలాసన్ రెడ్డి, జాయింట్ డైరెక్టర్ రాందాన్, డిప్యూటీ డైరెక్టర్ లు రాజవర్ధన చారి, పీ సరళ, డ్రగ్స్ ఇన్స్పెక్టర్లు గోవింద సింగ్ నాయక్, అనిల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.