- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
హైదరాబాద్ బుక్ ఫెయిర్ విజయవంతంగా ముగిసింది : డా.యాకూబ్
దిశ, హిమాయత్ నగర్ : దాశరథి కృష్ణమాచార్య ప్రాంగణంలో డిసెంబర్ 19 నుంచి 29 వరకు 37వ హైదరాబాద్ బుక్ ఫెయిర్ విజయవంతంగా ముగిసిందని హైదరాబాద్ బుక్ ఫెయిర్ సొసైటీ అధ్యక్షులు డా.యాకూబ్ అన్నారు. బుధవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సొసైటీ కార్యదర్శి ఆర్.శ్రీనివాస్ (వాసు), ఉపాధ్యక్షులు కె.బాల్ రెడ్డి, బి.శోభన్ బాబు, కోశాధికారి పి.నారాయణరెడ్డి, సభ్యులు స్వరాజ్ కుమార్, కృష్ణారెడ్డి,టి.సాంబశివరావులతో కలిసి ఆయన మాట్లాడారు. ఈ బుక్ ఫెయిర్ ను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారని, గవర్నర్ జిష్ణు దేవ్ శర్మ, పలువురు మంత్రులు, బుక్ ఫెయిర్ సలహాదారులు, ప్రభుత్వ అధికారులు, కవులు, రచయితలు, కళాకారులతో పాటు పుస్తక ప్రేమికులు పాల్గొన్నారని అని వివరించారు. జస్టిస్ రాధారాణి ముఖ్య అతిధిగా వచ్చి ముగింపు సమారోహం లో పాల్గొని ప్రసంగించారని తెలిపారు. 11 రోజుల పాటు జరిగిన ఈ పుస్తకాల పండగకి 13 లక్షల మంది దాకా హాజరయ్యారని పేర్కొన్నారు. 350 స్టాళ్లలో 210 పార్టిసిపెంట్స్ అనేక రకాల పుస్తకాలను ప్రదర్శించారని తెలిపారు. ఢిల్లీ, కలకత్తా , చెన్నై, పూణే వంటి నగరాల్లో బుక్ ఫెయిర్ లాగానే హైదరాబాద్ బుక్ ఫెయిర్ విస్తృత ప్రజాదరణ పొందిందని వెల్లడించారు.