Assembly: రేపు తెలంగాణ అసెంబ్లీ సమావేశం.. ప్రభుత్వ ఎజెండా విడుదల

by Ramesh Goud |
Assembly: రేపు తెలంగాణ అసెంబ్లీ సమావేశం.. ప్రభుత్వ ఎజెండా విడుదల
X

దిశ, వెబ్ డెస్క్: సోమవారం తెలంగాణ అసెంబ్లీ మూడవ సమావేశం(Telangana Assembly Sessions) జరగనుంది. ఇందులో ప్రభుత్వం ఎజెండాను అసెంబ్లీ సెక్రటరీ(Assembly Sewcretary) వీ నరసింహా చార్యులు(V Narasimha Charyulu) విడుదల చేశారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్(Former PM Manmohan Singh) మృతి చెందిన నేపథ్యంలో రాష్ట్రంలో ఏడు రోజుల పాటు సంతాప దినాలు పాటించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సంతాప దినాలలోనే అసెంబ్లీ వేదికగా మన్మోహన్ సింగ్ కి నివాళులు(Condolences) అర్పించాలని శాసనసభ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలోనే సోమవారం ఉదయం 10 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇందులో ముందుగా సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) మన్మోహన్ సింగ్ మృతిపై సంతాప తీర్మాణాన్ని(Condolence Motion) ప్రవేశపెట్టనున్నారు. ఈ సందర్భంగా.. ఆర్ధిక మంత్రిగా, ప్రధాన మంత్రిగా దేశానికి చేసిన మన్మోహన్ చేసిన సేవలను గుర్తు చేసుకోనున్నారు. అనంతరం రేవంత్ రెడ్డి సహా సభ్యులు మాజీ ప్రధాని మృతి పట్ల సంతాపం తెలియజేయడంతో పాటు ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలపనున్నారు.

Advertisement

Next Story

Most Viewed