Tirumala:శ్రీవారి దర్శనానికి పోటెత్తిన వీఐపీలు

by Jakkula Mamatha |   ( Updated:2025-01-01 13:39:19.0  )
Tirumala:శ్రీవారి దర్శనానికి పోటెత్తిన వీఐపీలు
X

దిశ, తిరుమల: నూతన ఆంగ్ల సంవత్సరం పురస్కరించుకొని శ్రీవారిని దర్శించుకోవడానికి వీఐపీలు పోటెత్తారు. జమ్మూ- కశ్మీర్ గవర్నర్ సిహెచ్ మనోజ్ సిన్హా, తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వేరువేరుగా కుటుంబ సభ్యులతో బుధవారం శ్రీవారిని వీఐపీ విరామ సమయంలో దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం విచ్చేసిన వీఐపీలకు ఘన స్వాగతం ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేసి తీర్థప్రసాదాలు ముందుగా ధ్వజస్థంభానికి మొక్కులు తీర్చుకున్న అనంతరం శ్రీవారి మూలమూర్తిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా.. ఆలయ అధికారులు వీరికి శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు.. ఆంగ్ల నూతన సంవత్సరం సందర్భంగా శ్రీవారి దర్శించుకోవడం చాలా సంతోషకరం గా ఉందని అన్నారు.

Advertisement

Next Story

Most Viewed