World famous resorts : పర్యాటకులు ఎక్కువగా ఇష్టపడే వరల్డ్ ఫేమస్ లగ్జరీ రిసార్టులివే..

by Javid Pasha |   ( Updated:2025-01-01 13:40:54.0  )
World famous resorts : పర్యాటకులు ఎక్కువగా ఇష్టపడే వరల్డ్ ఫేమస్ లగ్జరీ రిసార్టులివే..
X

దిశ, ఫీచర్స్ : ఉరుకులూ.. పరుగుల జీవితం.. ఒత్తిడీ ఆందోళనలతో సతమతం.. ఇదేనా లైఫ్ అంటే..! అప్పుడప్పుడూ ఇలాంటి పరిస్థితులను నుంచి ఉపశమనం పొందడానికి మనల్ని ఉల్లాస పరిచే విలాసవంతమైన ప్రయాణాలు, విహారాలు కూడా అవసరం అంటుంటారు పెద్దలు. అందుకోసం మీకంటూ ప్రత్యేక సమయం కేటాయించాలకుంటే.. అలసిన మనసును ఆహ్లాద పరిచేందుకు వరల్డ్ ఫేమస్ లగ్జరీ రిసార్ట్‌లు వెల్కమ్ చెబుతున్నాయి. జంటలు, అలాగే 18 ఏళ్లు పైబడిన ఎవరైనా సరే రొటీన్ లైఫ్‌కి భిన్నంగా కాస్త ప్రశాంతంగా సేదతీరాలనుకుంటే ఇవి అన్ని రకాల సౌకర్యాలనూ కల్పిస్తాయని ట్రావెల్ నిపుణులు చెబుతున్నారు. అలాంటి కొన్ని విలాసవంతమైన రిసార్ట్‌ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఎక్స్‌లెన్స్ ప్లేయా ముజెరెస్, మెక్సికో

కాంకున్‌( Cancun)కు ఉత్తరాన ఆధునిక హంగులతో, సకల సౌకర్యాలతో అలరారుతున్న అందమైన లగ్జరీ రిసార్ట్ పేరు ఎక్స్‌లెన్స్ ప్లేయా ముజెరస్. ప్రపంచ పర్యాటకులకు ఇది బాగా అట్రాక్ట్ చేస్తుంది. అందుకే దీనిని సంతోషాన్నిచ్చే స్వర్గధామంగా పిలుస్తుంటారు. ఆధునిక అలకంరణలతో, ప్రైవేట్ ప్లంజ్ పూల్స్‌తో, రూఫ్‌టాప్ టెర్రస్‌లతో విశాలంగా ఉన్న ఈ రిసార్ట్ ప్రపంచ స్థాయి విలాసవంతమైన సౌకర్యాలను అందిస్తుంది. ఇక్కడికి వచ్చిన అతిథులు ఇక్కడి ఇంటర్నేషనల్ రెస్టారెంట్లలో భోజనం చేయవచ్చు. ప్రత్యేక స్పాలో రిలాక్స్ అవ్వొచ్చు. ఇక్కడి అందమైన బీచ్‌లలో విహరిస్తూ.. కొలనుల్లో స్విమ్మింగ్ చేస్తూ.. ఆనంద పారవశ్యంలో మునిగిపోవచ్చు. చాలామంది సెలవులను ఎంజాయ్ చేయడానికి ఇక్కడికి వస్తుంటారు.

జేడ్ మౌంటైన్, సెయింట్ లూసియా

సెయింట్ లూసియా‌కు నైరుతి తీరంలో (southwestern coast) గల జేడ్ మౌంటైన్ రిసార్ట్ (Jade Mountain Resort) ఒక అందమైన ద్వీపంలో సహజ సౌందర్యాలతో మిళితమై ఉన్న నిర్మాణ కళాఖండమని చెప్పవచ్చు. ఇక్కడి పిటన్స్ వరల్డ్ హెరిటేజ్‌సైట్, అలాగే కరేబియన్ సముద్రం వైపుగా ఉన్న ఓపెన్ కాన్సెప్ట్ డిజైనింగ్ బెడ్ రూమ్, లివింగ్ ఏరియా, ప్రైవేట్ ఇన్ఫినిటీ పూల్‌ ఎంతో ఆకట్టుకుంటాయి. ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఆనందంగా గడిపే అందమైన, అద్భుతమైన రిసార్ట్‌గా జాడే మౌంటైన్ రిసార్ట్ ప్రసిద్ధి చెందింది. అయితే ఇక్కడికి15 సంవత్సరాలు పైబడిన వారిని మాత్రమే అనుమతిస్తారు.

కురా బోటిక్ హోటల్, కోస్టా రికా

కోస్టా రికా‌లోని దక్షిణ పసిఫిక్ కోస్ట్ పర్వతాలలో నెలకొని ఉన్న కురా బోటిక్ హోటల్ నిజానికి ఎకో- లగ్జరీ రిట్రీట్ అని చెప్పవచ్చు. ఇది హై-ఎండ్ కంఫర్ట్‌ను అందిస్తూ.. ప్రకృతితో మళ్లీ కనెక్ట్ అవ్వాలనుకునే వారికోసం రూపొందించబడింది. కురా ప్రాపర్టీ అంతటా సౌరశక్తి, పర్యావరణ అనుకూల పద్ధతులను ఉపయోగిస్తారు. ఇంటిమేటెన్ సెట్టింగ్స్‌‌తో ఎకో - కాన్షియస్ లగ్జరీ పట్ల నిబద్ధత కలిగిన వారికి, ప్రశాంతతను కోరుకునేవారికి ఇది బెస్ట్ చాయిస్.

నమలే రిసార్ట్ అండ్ స్పా, ఫిజీ

ఫిజీ (Fiji), నమలే (Namale) రిసార్ట్ అండ్ స్పా అనేది 525 ఎకరాల్లో ఉన్న ఒక ప్రైవేట్ ప్రాపర్టీలో నిర్మించారు. ఇది విలాసవంతమైన ఫీల్ అందించే ప్రపంచ ప్రసిద్ధి చెందిన ప్రాంతంగా గుర్తింపు పొందింది. దీనికి సంబంధించిన ఓషన్ ఫ్రంట్ విల్లాలు, అందమైన ఉద్యానవనాలతో ఇది అలరారుతూ ఉంటుంది. ప్రైవేట్ ప్లంజ్ పూల్స్, అవుట్ డోర్ షవర్లు, అక్కడి నుంచి పసిఫిక్ మహాసముద్రపు అద్భుతమైన వీక్షణలు ఉన్నాయి. నమలే దాని పర్సనలైజ్డ్ సర్వీస్‌ కారణంగా పర్యాటకులను ఆకట్టుకోవడంలో ప్రసిద్ధి చెందింది. ప్రైవేట్ డిన్నర్లు, డైవింగ్ విహార యాత్రలు, స్పా ట్రీట్‌మెంట్స్ వంటి క్యూరేటెడ్ ఎక్స్‌పీరియన్స్‌ను ఇది అందిస్తుంది.

నవీవా, పుంటా మిటా, మెక్సికో

లష్ జంగిల్(lush jungle) సెట్టింగ్‌లో ఉన్న నవీనా అనేది వరల్డ్ ఫేమస్ గుడారాలతో కూడిన లగ్జరీ రిసార్ట్. ఆరోగ్యం, స్థిరత్వం, ప్రకృతితో కనెక్ట్ అవ్వడం వంటి అంశాలకు ప్రాధాన్యత ఇచ్చే విధంగా, ఇమిటేట్ అండ్ ఎక్స్‌క్లూజివ్ ఎక్స్‌పీరియన్స్ అందించడానికి దీనిని నిర్మించారు. అంతేకాకుండా అతిథులు వెల్‌నెస్ ప్రోగ్రాములు, ప్రైవేట్ హైక్‌లు, పర్సనలైజ్డ్ డైనింగ్ అండ్ స్పా ట్రీట్మెంట్‌లను ఆస్వాదించవచ్చు. దీంతోపాటు రిసార్ట్ చుట్టుప్కల ఉన్న దట్టమైన, అందమైన అడబి ఆహ్లాదనాన్ని అందిస్తుంది.

సీక్రెట్స్ క్యాప్ కానా రిసార్ట్

డొమినికన్ రిపబ్లిక్‌లో‌ గల అందమైన జువానిల్లో బీచ్‌లో ఉన్న రిసార్ట్ పేరే సీక్రెట్ క్యాప్ కానా. ప్రపంచ వ్యాప్తంగా ఇది లగ్జరీ రిసార్ట్‌గా ఫేమస్ అయింది. అయితే ఇక్కడ కేవలం పెద్దలకు మాత్రమే అనుమతి ఉంటుంది. 18 ఏండ్లలోపు వారిని అలో చేయరు. వరల్డ్ ఫేమస్ హై లెవెల్ కరేబియన్ ఎస్కేప్‌ను ఇది అందిస్తుంది. అక్కడి సహజమైన తెల్లని ఇసుక, తేట నీటితో కూడిన జలాశయాలు, క్రిస్టల్ క్లియర్ వాటర్‌తో సీక్రెట్స్ క్యాప్ కానా రొమాంటిక్ వెదర్‌ను కలిగి ఉంటుంది. ఇక్కడి నుంచి సముద్రాన్ని వీక్షించడం అందమైన అనుభూతి కలిగిస్తుంది.

పామ్స్ జాంజిబార్, టాంజానియా

జాంజిబార్ (Zanzibar)‌ తూర్పు తీరంలో ఉన్న ది పామ్స్ అనేది ఏడు ప్రైవేట్ విల్లాలను కలిగి ఉన్న ప్రత్యేకమైన ఇంటిమేట్ రిసార్ట్ ( intimate resort). ప్రతీ విల్లా మోడర్న్ లగ్జరీ అయినా స్వాహిలి హస్తకళను మిళితం చేస్తూ చక్కగా రూపొందించబడింది. అతిథులకు పర్సనలైజ్డ్ సర్వీస్, ప్రైవేట్ బీచ్ క్యాబనాస్, హిందూ మహాసముద్రపు అద్భుతమైన వీక్షణలను ఇక్కడి నుంచి ఆస్వాదించవచ్చు. రిసార్ట్ స్నార్కెలింగ్, డైవింగ్, సాంస్కృతిక ప్రదేశాల సందర్శనలతో సహా అనేక కార్యకలాపాలను అందిస్తుంది. 16 ఏండ్లు అంతకంటే ఎక్కువ వయసున్నవారు మాత్రమే ఇక్కడ అనుమతించబడతారు.

ఇబిజా (Ibiza) హోటల్, స్పెయిన్

ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఐస్‌లాండ్ (island) ఇబిజా( Ibiza)లో ఇబిజా హోటల్ ఉంది. ఇది ఒక అందమైన ద్వీపంలోని వైబ్రెంట్ నైట్ లైఫ్‌ను అందిస్తుంది. ఆధునిక వసతి, ప్రైవేట్ బీచ్ క్లబ్ అండ్ గౌర్మెట్ డైనింగ్ ఎంపికలను అందిస్తుంది. సందడిగల సంత్ ఆంటోని ప్రాంతానికి సమీపంలో ఉన్న ఇబిజా ద్వీపంలో ఫేమస్ క్లబ్‌లు, బార్‌లు, బీచ్‌లు భలే ఆకట్టుకుంటాయి. ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన పార్టీ డెస్టినేసన్‌లలో ఇది ముఖ్యమైందని చెప్తారు. ఎగ్జాయిట్మెంట్ అండ్ రిలాక్సేషన్ కోసం ఇది సరైన డెస్టినేషన్ అంటుంటారు.

Advertisement

Next Story

Most Viewed