ఎమ్మెల్యే కృషితో గ్రామాల్లో అభివృద్ధి పనులు

by Naveena |
ఎమ్మెల్యే కృషితో గ్రామాల్లో  అభివృద్ధి పనులు
X

దిశ,రాజాపూర్ : జడ్చర్ల శాసనసభ్యులు జనంపల్లి అనిరుధ్ రెడ్డి కృషితో గ్రామాల్లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి నిధులు కేటాయిస్తున్నారని రాజాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షులు కోస్గి మల్లేష్ అన్నారు. ఆదివారం రాజాపూర్ మండలంలోని ముదిరెడ్డిపల్లి గ్రామంలో సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు. గ్రామంలోని బొడ్రాయి నుంచి శ్రీనివాస్ రెడ్డి ఇంటి వరకు దాదాపు 120 మీటర్ల మేర ఎమ్మెల్యే సహకారంతో.. సీసీ రోడ్డు పనులు ప్రారంభించినట్టు మల్లేష్ పేర్కొన్నారు. గ్రామంలో సీసీ రోడ్ ఏర్పాటు పట్ల గ్రామ ప్రజలు, యువకులు సంతోషం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో శేఖర్ రెడ్డి, తోట అశోక్ కుమార్, చొక్కంపేట పవన్ కుమార్, గ్రామస్తులు తదితరులు ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed