76కి చేరిన స్వచ్ఛ కాలనీ సమస్య కాలనీ ప్రోగ్రాం

by Naveena |
76కి చేరిన స్వచ్ఛ కాలనీ సమస్య కాలనీ ప్రోగ్రాం
X

దిశ, ఆలూర్ : ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని జర్నలిస్ట్ కాలనీ అభివృద్ధి కమిటి అధ్యక్షులు సుంకె శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వచ్ఛ కాలనీ సమైఖ్య కాలనీ కార్యక్రమం ఆదివారంతో 76వ వారానికి చేరుకుంది. 8వ వీధిలో మురుగు కాలువ, రోడ్డుకు ఇరువైపుల పిచ్చి మొక్కలను, గడ్డిని తొలగించి మురుగు కాల్వలు శుభ్రం చేశారు. ఈ సందర్భంగా సుంకే శ్రీనివాస్ మాట్లాడుతూ..కాలనీలో కుక్కలు, కోతుల బెడద త్రీవంగా ఉందని వీటి నివారణకు మున్సిపాలిటీ వారు తక్షణమే చర్యలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా కాలనీ సభ్యుల సహకారంతో నేటికి 76 వ వారానికి చేరిందన్నారు. అలాగే 2025 వ సంవత్సరంలో ఇదే ఉత్సాహంలో కొనసాగిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు సుంకే శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు కొంకేర భూమన్న,కొంతం రాజు, గణేష్,రాజ్ కుమార్,రవి, సాయన్న,జయ రాజ్, మాణిక్యం,మహదేవ్,రాజన్న,లక్ష్మణ్,వంశీ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story