Rs 2000 Notes : రూ.6,691 కోట్లు విలువైన రూ.2వేల నోట్లు ఇంకా ప్రజల్లోనే : ఆర్‌బీఐ

by Hajipasha |
Rs 2000 Notes : రూ.6,691 కోట్లు విలువైన రూ.2వేల నోట్లు ఇంకా ప్రజల్లోనే : ఆర్‌బీఐ
X

దిశ, నేషనల్ బ్యూరో : రద్దు చేసిన రూ.2వేల కరెన్సీ నోట్లలో 98.2 శాతం ఇప్పటికే వెనక్కి వచ్చేశాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) బుధవారం వెల్లడించింది. 2024 డిసెంబరు 31 నాటికి ఇంకా రూ.6,691 కోట్లు విలువైన రూ.2వేల నోట్లు మాత్రమే ప్రజల నడుమ మిగిలి ఉన్నాయని తెలిపింది. 2023 మే 19 నాటికి రూ.3.56 లక్షల కోట్లు విలువైన రూ.2వేల నోట్లు ప్రజల మధ్య ఉండేవని ఆర్‌బీఐ గుర్తు చేసింది.

2023 మే 19 నుంచి 2024 డిసెంబరు 31 మధ్యకాలంలో భారీగా రూ.2వేల నోట్లు ప్రజల నుంచి వెనక్కి వచ్చాయని పేర్కొంది. 2016 నవంబరులో రూ.2వేేల నోట్లను కేంద్రంలోని మోడీ సర్కారు ప్రవేశపెట్టింది. అయితే ఆ నోట్లను ఉపసంహరణ చేసుకుంటున్నామని 2023 మే 19న ప్రకటించింది. నాటి నుంచి రూ.2వేల నోట్లను వెనక్కి తీసుకునే ప్రక్రియ మొదలైంది.

Advertisement

Next Story

Most Viewed