ICC Awards : ‘వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు రేసులో స్మృతి మంధాన

by Harish |
ICC Awards : ‘వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు రేసులో స్మృతి మంధాన
X

దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన ఐసీసీ వార్షిక అవార్డుకు నామినేట్ అయ్యింది. మహిళల ‘వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు రేసులో నిలిచింది. అవార్డుకు పోటీపడుతున్న నామినీలను ఐసీసీ ఆదివారం ప్రకటించింది. 2018లో మంధాన ఈ అవార్డు గెలుచుకుంది. ఈ ఏడాది అద్భుత ప్రదర్శన చేసిన ఆమె మరోసారి అవార్డు రేసులో ముందున్నది. ఈ ఏడాది 12 ఇన్నింగ్స్‌లో మంధాన 61.91 స్టైక్ రేటుతో 743 పరుగులు చేసింది. అందులో నాలుగు సెంచరీలు ఉన్నాయి. ఒక్క వికెట్ కూడా పడగొట్టింది. అవార్డు కోసం మంధానకు గట్టీ పోటీనే ఎదుర్కోనుంది. సౌతాఫ్రికాకు చెందిన లారా వోల్వార్డ్ట్, శ్రీలంక కెప్టెన్ ఆటపట్టు, ఆస్ట్రేలియాకు చెందిన అన్నాబెల్ సుదర్లాండ్‌లు కూడా నామినేట్ అయ్యారు. ఎమర్జింగ్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు స్పిన్నర్ శ్రేయాంక పాటిల్ నామినేట్ అయిన విషయం తెలిసిందే.


Advertisement

Next Story