Air India: ఎయిర్ ఇండియా బంపర్ ఆఫర్.. విమాన టికెట్లపై భారీ తగ్గింపు..!

by Maddikunta Saikiran |   ( Updated:2024-12-29 16:26:48.0  )
Air India: ఎయిర్ ఇండియా బంపర్ ఆఫర్.. విమాన టికెట్లపై భారీ తగ్గింపు..!
X

దిశ, వెబ్‌డెస్క్: టాటా గ్రూప్(Tata Group)కు చెందిన ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా(Air India) న్యూ ఇయర్(New Year) సందర్భంగా విమాన ప్రయాణికులకు(Air Travelers) గుడ్ న్యూస్ చెప్పింది. విమాన టికెట్లపై భారీగా తగ్గింపు అందిస్తూ నిర్ణయం తీసుకుంది. ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో ఫ్లైట్ టికెట్లు(Flight Tickets) బుక్ చేసుకుంటే రూ.3,000 వరకు డిస్కౌంట్(Discount) అందిస్తోంది. దేశీయంగా ట్రావెల్ చేసే వారు ICICI750 ప్రోమోకోడ్ యూజ్ చేసి టికెట్ బుక్ చేసుకుంటే రూ. 750 ఫ్లాట్ డిస్కౌంట్ లభిస్తుంది. ఇక ఇంటర్నేషనల్ విమాన ప్రయాణాలపై రూ.2500 వరకు డిస్కౌంట్ అందిస్తోంది. ఈ ఆఫర్ పొందాలంటే ICICI2500 ప్రోమోకోడ్ ఉపయోగించాలి. మరోవైపు బిజినెస్ క్లాస్ సీట్లు బుకింగ్స్ పై రూ. 3,000 వరకు తగ్గింపు వస్తుంది. ఇందుకు ICICI3000 ప్రోమోకోడ్ యూజ్ చేయాలి. అయితే ఈ ఆఫర్ డిసెంబర్ 31 వరకే అందుబాటులో ఉంటుందని, టికెట్లు అధికారిక వెబ్ సైట్ https://www.airindia.com/ద్వారా బుక్ చేసుకోవాలని కంపెనీ వెల్లడించింది.

Advertisement

Next Story